అక్టోబర్‌లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పుంజుకొన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఏడీఏ) పేర్కొంది. గత నెలలో ప్యాసింజర్ 2,48,036 వాహనాలు అమ్ముడుపోగా.. గత ఏడాది ఇదే సీజన్‌లో 2,23,498 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోయినట్లు పేర్కొంది. ద్విచక్రవాహనాల విక్రయాలు 5శాతం పుంజుకొని 13,34,941కు చేరాయి. గత ఏడాది ఇవి 12,70,261 వద్ద ఉన్నాయి. ఇక వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం 23శాతం కుంగి 67,060కు చేరాయి. గత ఏడాది ఇవి 87,618గా ఉన్నాయి. ఆటోల విక్రయాలు నాలుగు శాతం పెరిగి 59,573కు చేరాయి. ‘‘అక్టోబర్‌లో రిటైల్ విక్రయాల గణంకాలు ఆటోమొబైల్ పరిశ్రమకు ఊరటనిచ్చాయి. ఈ సమయంలో ఇది చాలా అవసరం. ముఖ్యంగా డీలర్ల వర్గానికి ఇది చాలా అవసరం. పండుగ సీజన్ చాలా సానుకూలంగా ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన మార్కెట్ ప్రమాదం నుంచి బయటపడింది. ’’ అని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశీష్ హర్షరాజ్ కలే వెల్లడించారు.
చిన్నకార్లు బానే కొన్నారు
Related tags :