వెనిగర్‌ను సాధారణంగా వంటల్లో, సలాడ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే ఇది చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. వెనిగర్ అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలొస్తాయి. వెనిగర్‌ను ఉపయోగించి చర్మం, జుట్టు సంరక్షణ ఎలా పొందవచ్చంటే..చర్మాన్ని శుద్ధిచేయడానికి, టోన్ చేయడానికి మాయిశ్చరైజ్ చేయడానికి ప్రతిరోజు టోనర్‌ను ఉపయోగిస్తుంటాం. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను 3 టేబుల్ స్పూన్లు తాజా నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో ముఖంపై రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని మచ్చలు శాశ్వతమని, తొలగించడం కష్టమని భావిస్తుంటారు. కానీ వాటిని వెనిగర్‌తో తొలగించవచ్చు. కాస్త దూదితో మచ్చలపై వెనిగర్‌ను రాసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. నాలుగు నెలలు రోజూ ఇలా చేస్తే మచ్చలు తొలగిపోతాయి.చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు వెనిగర్, నీటిని సమాన మొత్తాల్లో కలిపి కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత 2 నిమిషాలు ఉంచి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఎక్కువసేపు షూ ధరించే వారు వాటిని విప్పగానే దుర్వాసన వస్తుంది. కాళ్లు కడుక్కున్నా కూడా వాసనపోదు. ఇలాంటి దుర్వాసనను తొలగించడానికి వెనిగర్ పనిచేస్తుంది.
సింగారానికి వెనిగర్ వాడదాం
Related tags :