గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రేపిన తుఫాన్ కొనసాగుతుంది. తెదేపా టార్గెట్ గా ఆయన చేస్తున్న విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఆయనపై లేని పోనీ ఆరోపణలను తెదేపా సోషల్ మీడియా అప్ లోడ్ చేస్తోంది. దీంతో వంశీ మళ్ళీ వాళ్ళే టార్గెట్ గా సంచలనాలకు తెరలేపారు. రోజుల కిందట జరిగిన ఓ సంఘటనను ఎత్తి చూపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ఇంటి నుంచి ఓ మహిళ మీద 10వేల ఈమెయిల్స్ పెట్టారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. వాళ్ళు పిలిచి అడగడంతో రాష్ట్రంలో చాలాపెద్ద వ్యక్తి దొరికిపోయాడు. ఐపీ అడ్రస్ సహా అన్ని వివరాలు చెప్పడంతో ఆ మహిళతో కాళ్ళ బేరానికి ఆ పెద్ద మనిషి వచ్చాడు. లిటరల్ గా కాళ్ళు పట్టుకున్నారు. పోలీసులతో పాటు ఆ కుటుంబం సీరియస్ గా నిలదీయడంతో తనకు తెలియకుండా జరిగిందని తమన ఇంట్లో వాళ్ళు చేశారని కల్లబొల్లి కబుర్లు చెప్పాలని చూశారు. నీకు తెలియకుండా మీ ఇంట్లో జరుగుతుందా? అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో చివరకు చేసేదేమీ లేక కాళ్ళు పట్టుకున్నారు. క్షమించండి అని కోరి బయటపడ్డాడు. పెద్ద ఇంటి వారిని వేధించాలని చూసి రాష్ట్రంలోని చాలా పెద్ద వ్యక్తిని ఎవరిని వేధించారు? అసలు ఎం జరిగింది? అని చర్చనీయంశంగా మారింది. కాళ్ళ బేరానికి వెళ్ళిన ఆ పెద్దమనిషి ఎవరూ అంటూ తెదేపా నేతలు ఎంక్వరి చేస్తున్నారు. వంశీ మాత్రం మూడు రోజుల నుంచి ఆ పెద్దమనిషి అని మాత్రమే చెబుతున్నారు కాని వ్యక్తిగతంగా ఆ మహిళ వివరాలు బయటపెట్టడం లేదు. దీంతో తెదేపాలోనే ఆపేద్ద మనిషి ఉంటారని తెలుస్తోంది. హైదరబాద్ జూబ్లీహిల్స్ లో ఉండే పెద్దమనిషి పై ఇప్పుడు అందరి చూపు పడింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ ఈ-మెయిల్స్ వ్యవహారం కూడా తెదేపాకి పెద్ద తలనొప్పి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
వంశీ ఆరోపించిన 10వేల ఈ-మెయిళ్ల పెద్దమనిషి ఎవరు?
Related tags :