1.గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారు. – ఆద్యాత్మిక వార్తలు – 19/11
ఇల్లు కట్టుకున్నాక బంధువులను పిలిచి గృహప్రవేశం చేసుకుంటాం. ఆ సమయంలో నూతన గృహంలో ముందుగా గోమాతను తీసుకెళ్లి ఇల్లంతా తిప్పిన తరవాతే ఇంటి యజమానీ, కుటుంబ సభ్యులూ లోపలికి వెళ్లడం ఆనవాయితీ. అలా మొదట గోమాతని ఎందుకు తిప్పుతారంటే… ఈ ఆచారం ఇప్పటిది కాదు అనాదిగా వస్తున్నది. ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపం. ఆ మాత వెంటే సమస్త దేవతలూ వెంట ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే నూతన గృహాల్లో గోవును తిప్పడం వల్ల ఆ దేవతలు కూడా మనింట్లో నడయాడతారట. అలానే గోవు మూత్రం, పేడలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. అందుకే ఇంట్లో గోవును తిప్పినప్పుడు మూత్రం, పేడ వేయడం కూడా శుభసూచకంగా భావిస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆవు మూత్రం, పేడా రెండూ కొత్తింట్లో క్రిములూ, ఇన్ఫెక్షన్లూ, దోమల్నీ దూరం చేస్తాయి. అలానే పేడా, మూత్రం, నెయ్యీ, పెరుగూ, పాలూ… అన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు. వీటిని హోమంలో వేసినప్పుడు వెలువడిన పొగ కూడా క్రిమి కీటకాల్ని బయటకు పంపుతుంది. వాతావరణంలోని విషవ్యర్థాలను పారదోలుతుంది. మరి అప్పుడే కదా మనం ఇంట్లో ఆరోగ్యంగా ఉండేది. అందుకే గృహప్రవేశం సమయంలో ఆవుకు అంత ప్రాధాన్యం.
2. 11న తిరుమలలో కార్తికపర్వ దీపోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 11న సాలకట్ల కార్తికపర్వ దీపోత్సవాన్ని తితిదే నిర్వహించనుంది. ఆ రోజు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తైన అనంతరం 5 గంటల నుంచి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలోని మూలమూర్తికి హారతి ఇస్తారు. ఆ తర్వాత అంతరాలయం, ఉపాలయాలు, గోపురాల వద్ద దీపాలంకరణ చేయనున్నారు. ఈ వేడుక కారణంగా పౌర్ణమి గరుడసేవ, సహస్ర దీపాలంకరణ సేవలను తితిదే రద్దుచేసింది.
3. శబరిమలలో మహిళల వయోనిర్ధారణకు తనిఖీలు
శబరిమలకు వస్తున్న మహిళా భక్తుల వయసును నిర్ధారించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. శబరిమలలో 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై గత ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే లేకున్నా.. ఆ గ్రూపు వారిని నిలిపివేస్తున్నారు. నీలక్కల్ వద్ద గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. కేరళ సర్కారు కూడా దీన్ని సమర్థిస్తూ.. అయ్యప్ప ఆలయానికి వచ్చే మహిళలకు భద్రత కల్పించలేమని ఇప్పటికే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. కాగా.. మండల పూజల సందర్భంగా శనివారం సాయంత్రం అయ్యప్ప సన్నిధానం తెరుచుకోగా.. సోమవారం ఉదయం వరకు 70వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
4. మల్లన్న సన్నిధిలో మహాకుంభాభిషేకం
కొమురవెల్లి మల్లికార్జునుడి క్షేత్రంలో మహాకుంభాభిషేకం ప్రారంభమైంది. ఐదురోజులపాటు జరిగే పూజల్లో భాగంగా తొలిరోజు ఆలయ ఆవరణలోని ప్రత్యేక యాగశాలలో అర్చకులు,వీరశైవ ఆగమ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి మహాకుంభాభిషేకం సందర్భంగా ఆగమ పండితుల మంత్రోత్సరణలతో మల్లన్న పుణ్యక్షేత్రం మార్మోగింది.ఆలయ రాజగోపురం నిర్మించి పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారు. చేశారు. స్వామి వారి క్షేత్రంలో ఐదు రోజుల పాటు నిర్వహించే కుంభాభిషేక మహాఘట్టానికి కర్ణాటకలోని ఉజ్జయిని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 జగద్గురువు సిద్దిలింగరాజా దేవీకేంద్ర శివాచార్య స్వామిజీ ఈనెల 21వ రాత్రికి కొమురవెల్లికి చేరుకొని 22న నిర్వహించే పూజల్లో పాల్గొననున్నారు.
5. పంచాంగం 19.11.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసమ్: కార్తిక
పక్షం: కృష్ణ బహుళ
తిథి: సప్తమి ప.02:07 వరకు
తదుపరి అష్టమి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: ఆశ్లేష రా.08:48 వరకు
తదుపరి మఘ
యోగం: బ్రహ్మ , ఇంద్ర
కరణం: బవ
వర్జ్యం: ఉ.10:11 – 11:48
దుర్ముహూర్తం: 08:38 – 09:23
రాహు కాలం: 02:50 – 04:15
గుళిక కాలం: 12:01 – 01:25
యమ గండం: 09:11 – 10:36
అభిజిత్ : 11:39 – 12:23
సూర్యోదయం: 06:22
సూర్యాస్తమయం: 05:39
వైదిక సూర్యోదయం: 06:26
వైదిక సూర్యాస్తమయం: 05:35
చంద్రోదయం: రా.11:58
చంద్రాస్తమయం: ప.12:16
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: ఉత్తరం
పైతామహాకృచ్ఛ వ్రతం
ఝూన్సీ లక్ష్మీబాయి జయంతి
ప్రళయకల్ప ప్రారంభం
తూము రామదాసు పుణ్యతిథి
కాలాష్టమి కాలభైరవ జయంతి
6. రాశిఫలం – 19/11/2019
తిథి:
బహుళ సప్తమి మ.1.24, కలియుగం-5121 శాలివాహన శకం-1941
నక్షత్రం:
ఆశ్రేష రా.8.04
వర్జ్యం:
ఉ.9.27 నుండి 10.57 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. కొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృ:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. మానసికాందోళన తప్పదు.
7. శ్రీరస్తు శుభమస్తు
తేది : 19, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : భౌమవాసరే (మంగళవారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి
(నిన్న సాయంత్రం 5 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు సప్తమి తిధి తదుపరి అస్టమి తిధి)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న రాత్రి 10 గం॥ 21 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 22 ని॥ వరకు ఆశ్లేష నక్షత్రం తదుపరి మఖ నక్షత్రం )
యోగము : (శుక్లం ఈరోజు తెల్లవారుఝాము 0 గం ll 32 ని ll వరకు తదుపరి బ్రహ్మం ఈరోజు రాత్రి 10 గం ll 6 ని ll వరకు)
కరణం : (బవ ఈరోజు సాయంత్రం 3 గం ll 36 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 53 ని ll)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 23 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 17 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 6 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 17 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 29 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 23 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : వృచ్చికము
8. శుభోదయం
మహనీయుని మాట
” ఎలాగైనా బ్రతకాలి…
అనుకునే వాడికి
ఈ సమాజంలో అవకాశాలకు కొదవలేదు!
ఇలాగే బ్రతకాలి…
అనుకునే వాడికి ఈ సమాజంలో అవమానాలు తప్పవు
అడుగడుగునా ఆటంకాలూ తప్పవు”..!
9. నేటి మంచి మాట
” మనసులో కుళ్లు పెట్టుకుని
పైకి పూజలు చేయడం అంటే…
ఇంట్లో బూజు పెట్టుకుని
బయట దులపడం లాంటిది”…!
10. నేటి ఆణిముత్యం
చంపదగిన యట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యము :
మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని ఎటువంటి కీడు చేయకూడదు. అవసరమైతే తగినంత మేలు, మంచిమాటలు, గౌరవమర్యాదలు చేసి పొమ్మనడమే ఎంతో మేలు. (మనిషిలో మార్పును రాబట్టడానికే వేమనగారు ఈ పద్యాన్ని రచించారు)
11. నేటి సుభాషితం
ఎక్కువ తక్కువలు, కులమత భేదాలూ ఉండటం మానవజాతికి అవమానకరం
నేటి జాతీయం
కొండవీటి చాంతాడంత
చాల పొడవైన అని అర్థం: అక్కడ లైను (క్యూ) కొండవీటి చాంతాడంత ఉంది.
12. మన ఇతిహాసాలు
శివతాండవం చూసేందుకు ఆదిశేషుడు ఎత్తిన అవతారం – పతంజలిభారతీయులు ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగశాస్త్రం. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ శాస్త్రపు విలువ పెరుగుతూనే ఉంది. ఆరోగ్యానికి అంతకు మించిన సాధన లేదని రుజువు చేస్తూనే ఉంది. అంతటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి గురించి మాత్రం పెద్దగా సమాచారం కనిపించదు. కానీ కొన్ని కథలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ఇదిగో… శివుడు ఒకసారి దేవతలు, రుషులందరి సమక్షంలోనూ తాండవం చేశాడట. చూపరులందరినీ కట్టిపడేసిన ఆ తాండవం గురించి లోకమంతా గొప్పగా చెప్పుకోసాగింది. ఆ నృత్యాన్ని స్వయంగా వీక్షించిన విష్ణుమూర్తి సైతం శివతాండవం గురించి పదే పదే తల్చుకోసాగాడు. విష్ణుమూర్తిని మోస్తున్న ఆదిశేషునికి సైతం ఆ పొగడ్తలు చేరాయి. ఇంతమందిని అలరించిన తాండవాన్ని తాను చూడలేకపోయానే అని ఆదిశేషునిలో బాధ మొదలైంది. ఆ బాధ క్రమేపీ పెరిగి ఆయన మనసుని దహించివేసింది. ఎలాగైనా తాను కూడా శివతాండవాన్ని చూడాలని అనుకున్నాడు. కానీ అది మాటలు కాదు కదా! ఎప్పుడో కానీ సంభవించని సందర్భం అది.
ఆదిశేషుని మనసులోని దుగ్ధను గ్రహించిన విష్ణుమూర్తి- భూమిమీద జన్మించి, శివుని ధ్యానించి తన కోరికను తీర్చుకోమని సూచించాడు. అదే సమయంలో గోనిక అనే భక్తురాలు సంతానం కోసం భగవంతుని ప్రార్థిస్తోంది. ఒకరోజు ఆమె సూర్యునికి అర్ఘ్యం అందిస్తుండగా ఆ నీటిలో ఒక పాముపిల్ల రూపంలో అవతరించాడు ఆదిశేషుడు. అంజలి ఘటిస్తుండగా పతం (ఆకాశం) నుంచి వచ్చిపడ్డాడు కాబట్టి అతనికి ‘పతంజలి’ అన్న పేరు స్థిరపడిందంటారు.పతంజలి పెరిగిపెద్దవాడయి సకలశాస్త్రాలనూ ఔపోసన పట్టేశాడు. చిదంబరంలో శివుని గురించి తపస్సు చేసుకుంటూనే వేదాధ్యయనాన్ని సాగించాడు. అదే సమయంలో చిదంబరంలో వ్యాఘ్రపాదుడు అనే మరో రుషి కూడా ఉండేవాడు. శివుని అర్చించేందుకు ఎంతటి శ్రమకైనా ఓర్చి పూలు సాధించేందుకు తనకు పులి పాదాలు కావాలని ఆ ముని కోరుకున్నాడట. అందుకనే ఆయనకు ఆ పేరు వచ్చింది. చిదంబరంలో ఉన్న ఆ ఇద్దరు రుషుల దీక్షకు మెచ్చి పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమైనాడు. వారి కోసం ఆనందతాండవాన్ని నర్తించాడు. అక్కడే నటరాజ స్వామిగా వెలిశాడు.చిదంబరంలో వ్యాఘ్రపాదుడు, పతంజలి స్వామివారిని పూజించారనేందుకు నమ్మికగా అక్కడి చిత్రాలలో స్వామివారిని పూజిస్తున్న ఇద్దరు రుషులూ కనిపిస్తారు. అసలు చిదంబరంలోని ఆలయాన్ని పతంజలి స్వయంగా నిర్మించారని కూడా కొందరంటారు. నిజానికి పతంజలి పేరుతో చాలా ప్రముఖ గ్రంథాలే కనిపిస్తాయి. ఇవన్నీ రాసినవారు వేర్వేరు వ్యక్తులనీ…. భారతీయ సాహిత్యంలో కనీసం ఒక ఐదుగురు పతంజలిలు ఉన్నారని కొందరంటారు. కానీ పతజంలి అన్నవాడు ఒక్కడే అని మరికొందరి నమ్మకం! పతంజలి జీవన కాలం గురించి కూడా ఇలాంటి సందిగ్ధతే ఉంది. క్రీ.పూ ఊదో శతాబ్ది వాడని కొందరంటే అంతకు కొన్ని వేల సంవత్సరాల మునుపువాడని మరికొందరి వాదన.ఏది ఏమైనా అప్పటివరకూ జ్ఞానులకు మాత్రమే తెలిసిన యోగసూత్రాలను క్రోడీకరించి ప్రపంచానికి అందించడంలో పతంజలి అనే వ్యక్తి చేసిన కృషి అసాధారణం అని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఇక పతంజలిని సగం పాము రూపంలో కొలవడంలోనూ ఒక ఆంతర్యం కనిపించకపోదు. మనలోని కుండలినిని సర్పంగా భావిస్తుంటారు. నిద్రాణంగా ఉన్న ఆ కుండలినిని జాగృతం చేయగలిగిన రోజున మోక్షం సాధ్యమన్నది యోగుల మాట. ఆ కుండలినీ శక్తిని సూచించేందుకు యోగశాస్త్రకారుడైన పతంజలికి సర్పరూపాన్ని అందించి ఉండవచ్చు.
13. చరిత్రలో ఈ రోజు/నవంబర్ 19
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం-ప్రపంచ టాయిలెట్ డ
1828 : ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జననం (మ.1858).
1917 : భారత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జననం (మ.1984).
1928 : భారతదేశానికి చెందిన మల్లయోధుడు దారా సింగ్ జననం (మ.2012).
1954 : ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ జననం.
1973 : ప్రముఖ భారతీయ నటి షకీలా జననం.
1975 : విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడిన భారతీయ నటి సుష్మితా సేన్ జననం.
1977 : తుపానుయొక్క ఉప్పెన సృష్టించిన భీభత్సానికి ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని దివిసీమ నాశనమయింది.
1995 : సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి మరణం (జ.1908).
2007 : ప్రముఖ కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు పులికంటి కృష్ణారెడ్డి మరణం (జ.1931).
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
image.gif
14. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు మంగళవారం,
19.11.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-25℃°
• నిన్న 71,691 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 02
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 25,588 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.90 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
#ఈనెల 26న వృద్ధులు /
దివ్యాంగులకు ప్రత్యేక
ఉచిత దర్శనం,
(భక్తులు రద్దీ సమయాల్లో
ఇబ్బంది పడకుండా ఈ
అవకాశం సద్వినియోగం
చేసుకోగలరు)
#ఈనెల 27 న చంటిపిల్లల
తల్లిదండ్రులకు శ్రీవారి
ప్రత్యేక ప్రవేశ దర్శనం
(ఉ: 9 నుండి మ:1.30
వరకు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి
అనుమతిస్తారు,
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు
మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
15. మరో సంచలనానికి తెరలేపిన టిటిడి పాలకమండలి..
టిటిడి ఫిక్సేడ్ డిపాజిట్లను జాతీయ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలని నిర్ణయించిన టిటిడి పాలకమండలి…పాలకమండలి నిర్ణయంతో ఏటా టిటిడికి వడ్డి రూపేణా సుమారు 100 కోట్ల నష్టం…5 వేల కోట్లు వరకు ప్రయివేట్ బ్యాంకులో డిపాజిట్ చేసే వెసులుబాటును ప్రక్కన పెట్టేసిన పాలకమండలి..ప్రయివేట్ బ్యాంకులో 8.6 శాతంతో వస్తున్న వడ్డిని కాదని…. జాతీయ బ్యాంకులో ఇస్తున్న 6.57 శాతం వడ్డీని మాత్రమే కావాలంటున్న టీటీడీ పాలకమండలి..పాలకమండలి ఆదేశాలతో 1400 కోట్ల రూపాయల డిఫాజిట్లును సిండికేట్ బ్యాంక్ లో డిఫాజిట్ చేసిన టిటిడి అధికారులు..ఇప్పటికే టిటిడి డిపాజిట్ల ను వద్దని చెప్పేసిన sbi ఆంధ్రా బ్యాంకులు… వడ్డీ..ఆదాయం తగ్గుముఖం పట్టడంతో బడ్జెట్ లోటును ఎలా భర్తి చెయ్యాలో అర్దంకాక తలలు పట్టుకుంటున్న టిటిడి ఆర్దికశాఖ అధికారులు..
16. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంసిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ ప్రభాకర్, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ మధుసూదన్, ఎవిఎస్వో శ్రీ నందీశ్వర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ కోలా శ్రీనివాసులు, ఆలయ ఆర్చకులు శ్రీ ప్రతాప్, శ్రీ మణికంఠస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
23-11-2019(శనివారం) ధ్వజారోహణం చిన్నశేషవాహనం
24-11-2019(ఆదివారం) పెద్దశేషవాహనం హంసవాహనం
25-11-2019(సోమవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
26-11-2019(మంగళవారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
27-11-2019బుధవారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
28-11-2019(గురువారం) సర్వభూపాలవాహనం స్వర్ణరథం, గరుడవాహనం
29-11-2019(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
30-11-2019(శనివారం) రథోత్సవం అశ్వ వాహనం
01-12-2019(ఆదివారం) పంచమితీర్థం ధ్వజావరోహణం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
17. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో భక్తులు అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని తెలిపింది. కాగా కానుకల రూపంలో టీటీడీకి ప్రతి ఏడాది పెద్ద ఎత్తను విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. అయితే వీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో ఇక మీదట డిపాజిట్ చేయవద్దని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.