*** చేపలు, చికెన్, మాంసం-వీటిలో ఏది ఆరోగ్యకరమైనది?
*** రోజూ మాంసాహారం తినవచ్చా?
కొందరికి మాంసాహారం అంటే తెగ ఇష్టం. ఇలాంటి వారికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మరి కొందరికేమో శాకాహారమే ముద్దు. మాసం వాసనొస్తేనే వీరికి వాంతికొస్తుంది. నాన్‌వెజ్ తినేందుకు చాలారకాల ఆప్షన్స్ ఉన్నాయ్. చికెన్, మటన్, ఫిష్ ఇలా బోలెడు. అయితే వీటన్నింటిని రెడ్ మీట్, వైట్ మీట్ అని రెండు రకాలుగా డివైడ్ చేశారు. రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్, పోర్క్ లాంటివి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి, రొయ్యలు, పీతలు, పక్షల మాంసం. చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్‌లో ప్రొటీన్‌తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి, కొవ్వు తినకూడదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునేవాళ్లు.. మటన్‌కి బదులు చికెన్‌ను ఎంచుకుంటారు. అయితే కొలెస్ట్రాల్‌తో సంబంధం లేని వాళ్లు మాత్రం.. మటన్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావనుకునే వాళ్లు చేపలు, రొయ్యలు తింటుంటారు. అసలు ఈ మూడింట్లో ఏది మంచిది. ఏది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది అని తెలుసుకునేందుకు.. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ’ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది. ఇప్పటి వరకు కొలెస్ట్రాల్‌ను పెంచే మాంసాహారం.. రెడ్ మీట్ ఒక్కటే అనుకునే వాళ్లు. కానీ ఈ రీసెర్చ్ ఆ ఆలోచనని పూర్తిగా మార్చేసింది. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కార్డియోవాస్క్యులర్ జబ్బులకు కారణమవుతాయని తేల్చింది. మాంసం ఏదైనా కొలెస్ట్రాల్ మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతుందట. కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా ఆవు, ఎద్దు, గొర్రె లాంటి జంతువుల మాంసాలలో కార్నిటైన్ అనే పదార్థం కూడా ఉంటుంది. అది గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. దానివల్ల గుండె దెబ్బతింటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగా మనం తినే ఏ మాంసాహారంలోనైనా ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే మటన్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్, చేపలు, రొయ్యల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అధికంగా తింటే శరీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), ట్రై గ్లిజరైడ్లు చేరతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అలాగే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగా తినాలి. ప్రతి రోజూ మాంసాహారం తినవచ్చా? ఈ క్రమంలోనే నిత్యం ఏ మాంసాహారం అయినా సరే.. అందులో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి నిత్యం కావల్సిన కొవ్వు పదార్థాల మోతాదు మించకుండా మాంసాహారాలను తినాలి. ఇలా తింటే రోజూ మాంసాహారం తిన్నా ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. ఇక చికెన్, చేపలను రోజూ తినవచ్చు. కాకపోతే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరానికి ప్రోటీన్లు లభించి కణజాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి.
మాంసాహారం? శాఖాహారం? తరచుగా శాకాహారి ఆహారాలు తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కొన్నిసార్లు అలెర్జీలు మాత్రమే సంభవిస్తాయి. కాని మాంసాహార ఆహారాల విషయంలో దీనికి విరుద్ధంగా ఉంటుంది. మాంసాహార ఆహారాన్ని పెద్ద మొత్తంలో తినడం వల్ల బరువు పెరగడానికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది సీ ఫుడ్స్ సీఫుడ్స్ ముఖ్యంగా వీటిలో సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మరింత ఉత్తమని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్ మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినవచ్చు.
ప్రయోజనాలు
సీఫుడ్ వంటి చేపలను తినడం వల్ల మెదడు సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, కంటి చూపు బాగా ఉంటుంది. సీఫుడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించే శక్తిని కలిగి ఉంటుంది. ఎముకల నష్టాన్ని తగ్గించడానికి మరియు విశ్రాంతి నిద్రను అందించడానికి సీఫుడ్స్ ఉత్తమ ఎంపిక. చికెన్ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలకు ఇవి ప్రాథమిక మూలం. ఇది శారీరక పెరుగుదల మరియు పనితీరులో సహాయపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకండి. బ్రాయిలర్-రకం కోళ్లను వీలైనంత కాలం నివారించడం మంచిది. కోళ్లను తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మరి వీటిలో రెగ్యులర్ గా తినేవారికి ఏది ఉత్తమ? బరువు తగ్గాలని చూస్తున్న వారికి చికెన్ ఉత్తమ ఎంపిక. చికెన్ గొడ్డు మాంసం మరియు మటన్ కంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు ఖనిజాలకు కూడా చికెన్ మంచి ఎంపిక. మాంసం మాంసంలో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలున్నా, మాంసం మాంసమే. మాంసాన్ని ఎక్కువగా తినవద్దు ఎందుకంటే ఇది నోటికి రుచిగానే ఉండవచ్చు కానీ గొడ్డు మాంసం, మటన్ మరియు పంది మాంసం వంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు ముఖ్యంగా హార్ట్ సమస్యలు పెరుగుతాయి.