రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న విత్తన చట్టం-1966 స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. విత్తనాల తయారీ, పంపిణీపై నిఘా ఉంచడంతో పాటు నాసిరకం విత్తనాలు విక్రయించడంపై కూడా ఉక్కుపాదం మోపే విధంగా ఈ చట్టం రూపొందిస్తున్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే నాసిరకం విత్తనాలు విక్రయిస్తూ పట్టుపడితే రూ.5లక్షల వరకూ జరిమానా విధిస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం మేరకు గరిష్ఠంగా రూ.5వేల వరకూ మాత్రమే జరిమానా విధించే అవకాశం ఉంది. దీంతో అనేక మంది ఎలాంటి భయమూ లేకుండా నకిలీ విత్తనాలను అమ్మేస్తున్నారు. క్రిమి సంహారక నిర్వహణ బిల్లును కూడా తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
విత్తనాలపై సరికొత్త చట్టం
Related tags :