DailyDose

ఇన్ఫోసిస్ వివరణ-వాణిజ్యం-11/20

Infosys Delivers Press Comment On CEO-Telugu Business News-11/20

* మార్కెట్ లో బంగారం, వెండి ధరలు……వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,210, విశాఖపట్నంలో రూ.39,400, ప్రొద్దుటూరులో రూ.39,000, చెన్నైలో రూ.38,100గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,380, విశాఖపట్నంలో రూ.36,240, ప్రొద్దుటూరులో రూ.36,120, చెన్నైలో రూ.36,490గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,700, విశాఖపట్నంలో రూ.46,100, ప్రొద్దుటూరులో రూ.46,200, చెన్నైలో రూ.48,300 వద్ద ముగిసింది.

* గల్ఫ్‌ ఎయిర్‌వేస్‌తో ఒక అవగాహన పత్రంపై స్పైస్‌ జెట్‌ నేడు సంతకం చేసింది. ఈ ఒప్పందంతో రెండు సంస్థల మధ్య బలమైన సమన్వయం సాధ్యమవుతుందని స్పైస్‌జెట్‌ పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం రెండు విమానయాన సంస్థలు ఇంటర్‌లైన్‌, కోడ్‌ షేరింగ్‌, రవాణ సేవల్లో సమన్వయం, ఇంజినీరింగ్‌ సేవలను, పైలట్‌ ట్రైనింగ్‌ వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.

* సీఈవో సలీల్‌ పరేఖ్‌పై మరోసారి ఆరోపణలు వచ్చాయన్న వార్తలపై ఇన్ఫోసిస్‌ వివరణ ఇచ్చింది. గతంలో వచ్చిన ఆరోపణలపై అక్టోబరు 22న స్టాక్‌ఎక్సేంజీలకు వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, మీడియా కథనాల్లో పేర్కొంటున్న తాజా ఆరోపణలు కూడా గతంలో కంపెనీ సమర్పించిన పాత ఆరోపణల వివరాలనే సూచిస్తున్నాయని వివరించింది. ఈ మేరకు వివరణ ఇస్తూ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మంగళవారం కంపెనీ ఒక లేఖ రాసింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఆరోపణలపై సంస్థ అంతర్గత విధానాలు, సెబీ నియమ నిబంధనల ప్రకారం వివరణను సమర్పించామని తెలిపింది. దీనిపై అవసరమైతే మరింత సమచారం, స్పష్టత ఇచ్చేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని పేర్కొంది.

 

Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE Telugu Business News Rounup Today November 20 2019-TNILIVE