కొరియా మాస్టర్స్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. మాజీ ప్రపంచ నంబర్‌వన్ కిదాంబి శ్రీకాంత్, యువ షట్లర్ సమీర్ వర్మ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఆరోసీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్ 21-18, 21-17 తేడాతో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)ను వరుస గేముల్లో చిత్తుచేశాడు. కేవలం 37 నిమిషాల్లో అతడిని ఓడించాడు. వీరిద్దరూ ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో తలపడగా కిదాంబి 11-3తో తిరుగులేని ఆధిక్యంతో ఉన్నాడు. తర్వాతి రౌండ్లో జపాన్ షట్లర్ కంటా సునెయామతో తలపడతాడు. సమీర్ వర్మ తొలి గేమ్‌లో 11-8తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి కజుమస సకాయ్ (జపాన్) మ్యాచ్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. దీంతో భారత షట్లర్ నేరుగా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తన సోదరుడు సౌరభ్‌ను 21-13, 12-21, 13-21 తేడాతో ఓడించిన స్థానిక ఆటగాడు కిమ్ డాంగున్‌తో సమీర్ తర్వాతి మ్యాచ్‌లో తలపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్ నుంచి మహిళా ప్రాతినిధ్యం లేదు.
కొరియా ఓపెన్‌లో కిదాంబి ముందడుగు
Related tags :