నెమ్మదిగా లోడ్ అయ్యే వెబ్‌సైట్‌లను గుర్తించేందుకు అంతర్జాల దిగ్గజం గూగుల్ ప్రణాళికలు వేస్తోంది. అలాంటి వాటిని బ్రౌజింగ్ చేసేటప్పుడు క్రోమ్‌లో ప్రత్యేక లేబుల్ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని క్రోమ్ డెవలప్‌మెంట్ బృందం తమ బ్లాగ్‌లో వెల్లడించింది. అయితే, ఏ కారణం వల్ల సైట్ నెమ్మదిగా లోడ్ అవుతుందో తెలిపేందుకు కూడా క్రోమ్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు డివైజ్ హార్డ్‌వేర్ లేక నెట్‌వర్క్ కనెక్టివిటీల్లో ఏ సమస్య ఉందో లేబుల్ ద్వారా తెలిపేలా రూపొందిస్తున్నట్లు బ్లాగ్‌లో పేర్కొన్నారు.
వెబ్‌సైట్ నెమ్మదిగా ఉంటే క్రోమ్ కనిపెడుతుంది
Related tags :