అంతర్జాతీయ షూటింగ్ వరల్డ్‌కప్‌లో ఇవాళ భారత షూటర్ మనూ బాకర్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది.
చైనాలోని పుటియన్‌లో జరిగిన ఈవెంట్‌లో.. 17 ఏళ్ల బాకర్ మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్తోల్ పతకాన్ని కైవసం చేసుకున్నది.
ఇప్పటికే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించిన బాకర్.. ఈ ఈవెంట్‌తో జూనియర్ వరల్డ్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ 10మీటర్ల ఎయిర్ పిస్తోల్ క్యాటగిరీలో గతంలో భారత షూటర్ హీనా సింధు కూడా స్వర్ణ పతకం సాధించింది.
ఇప్పుడు అదే ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన రెండవ భారత క్రీడాకారిణిగా మనూ బాకర్ నిలిచింది.
ప్రస్తుత టోర్నీలో మరో షూటర్ యశశ్విని దేశ్‌వాల్ 158.8 పాయింట్లు స్కోర్ చేసి ఆరవ స్థానంలో నిలిచింది.
సెర్బియాకు చెందిన జోరానా అరునోవిక్‌కు సిల్వర్ మెడల్ దక్కగా, చైనాకు చెందిన క్విన్ వాంగ్ మూడవ స్థానంలో నిలిచింది.
బుధవారం జరిగిన మహిళల 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో మాత్రం మనూ బాకర్ నిరాశపరిచింది.