నటనతోపాటు ఫిట్‌నెస్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఫిట్‌నెస్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకొంటారు. తాజాగా ఆయన ఒక విషయంలో ఫిట్‌నెస్ ప్రేమికులను హెచ్చరించారు. తమ శరీరాకృతి బాగుండాలని చాలా మంది ఉత్ర్పేరకాలు (స్టెరాయిడ్స్)ను వాడుతున్నారని, వాటివల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఉత్ర్పేరకాల వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఉత్ర్పేరకాలను వాడడం ఒక ట్రెండ్‌గా మారింది. కానీ, అలా చేయడం తప్పు. చాలామంది స్టెరాయిడ్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల వారి కిడ్నీలు, కాలేయానికి హానీ కలుగుతుంది. ఉత్ర్పేరకాలు వాడి జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గుండెనొప్పితో చనిపోయారు. అందుకే వాటికి దూరంగా ఉండండి. ప్రొటీన్ షేక్స్ మన శరీరానికి చాలా మంచివి. స్టెరాయిడ్స్ వాడకం వల్ల మంచి శరీరాకృతిని పొందవచ్చు.. కానీ, అది సహజంగా అనిపించదు. అలాంటి శరీరాకృతి చాలా రోజులు నిలవదు. ఖాళీ సమయంలో వర్కౌట్లు చేయండి. లంచ్, డిన్నర్ తర్వాత, అలాగే షూటింగ్ మధ్యలో నాకు కొంచెం ఖాళీ సమయం ఉంటుంది. అలాంటి సమయాల్లో నేను ఏదో ఒక శరీర భాగానికి సంబంధించి ఎక్స్‌ర్‌సైజ్ చేస్తాను. జిమ్‌లో రెండు, మూడు వర్కౌట్లు చేసే సమయం నాకు లేదు’ అని సల్మాన్ అన్నారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘దబాంగ్ 3’ సినిమాలో సల్మాన్ నటించారు. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా సోనాక్షి సిన్హా కనిపించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సల్మాన్ కొత్త సినిమా ‘రాధే’ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమయ్యింది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జంటగా దిశాపటానీ కనిపించనున్నారు.
సల్మాన్ స్టెరాయిడ్ సలహా
Related tags :