నేటి తరం అమ్మాయిల క్యాజువల్ వేర్ జీన్స్. ఇదొక్కటే ఉంటే సరిపోదు…ఆ లుక్‌ని స్టైలిష్‌గా మార్చడంలో పాదరక్షల పాత్రా ఎక్కువే. ఏవి ఎంచుకోవాలనేదే మీ సందేహం అయితే… ఇది చదవండి.
* బూట్లు, ఫ్లాట్స్, స్నీకర్స్, శాండిల్స్… ఇలా అన్నీ జీన్స్ మీదకు కొత్త లుక్‌ని తెచ్చిపెడతాయి. స్కిన్నీ జీన్స్- గుండ్రటిమెడతో ఉన్న టీషర్ట్‌కి జతగా బూట్లు మెప్పిస్తాయి.
* టీషర్టు, అంచులు మడిచిన కాఫ్‌లెంగ్త్ జీన్స్ వేసుకున్నప్పుడు స్నీకర్స్‌ని ప్రయత్నించండి. క్యాజువల్ లుక్‌కోసం ట్రైనర్ రకాలు నప్పుతాయి.
* హై యాంకిల్ జీన్స్‌కి, స్నీకర్స్ జోడీ అదిరిపోతుంది. బాయ్‌ఫ్రెండ్ జీన్స్ వేసుకుంటున్నారా… దీనికి స్ట్రాప్స్ ఉన్న ఫ్లాట్స్ ప్రయత్నించండి. ట్యూనిక్‌లు, కౌల్స్ డిజైన్ టాప్‌లు ధరించినప్పుడూ వీటిని వాడొచ్ఛు
* రౌండ్ బాటమ్ జీన్స్‌కి ఎత్తుమడమల చెప్పులు ఏవైనా వేసుకుంటే ఆ అందమే వేరు. లేతరంగు జీన్స్‌కి జతగా తెలుపు వర్ణంలో స్నీకర్స్‌ని ఎంచుకోవచ్ఛు ● ముదురు రంగు వెడ్జెస్ లేత ఛాయల్లో జీన్స్ రకాలకు మ్యాచింగ్ అవుతాయి. ఎత్తు తక్కువ ఉన్నవారు వీటిని ఎంచుకుంటే ట్రెండీగా కనిపిస్తారు.
* నీలం రంగు జీన్స్‌కి జతగా ఫ్లాట్ యాంకిల్ బూట్లు చక్కగా నప్పుతాయి.