తమ నటనతో ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్, నటి భూమి పెడ్నేకర్. ఇప్పటికే ‘దమ్ లగాకే హైసా’, ‘శుభ్ మంగళ్ సావధాన్’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ జంట నటించిన చిత్రం ‘బాలా’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో భూమి పెడ్నేకర్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ‘వెండితెరపై మా జంటను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నటీనటులుగా మేము ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటుంటాం. అంతేకాకుండా సినిమాలపరంగా మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. మా జంటను ప్రేక్షకులు ఇష్టపడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేమిద్దరం కలిసి మూడు చిత్రాలు చేశాం. ఇప్పటివరకూ మేము నటించిన మూడు చిత్రాలు కూడా నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆధారంగా చేసుకుని తెరకెక్కినవే. కాబట్టి మా జంట విజయవంతం కావడానికి ప్రధానం కారణం సమాజంలోని సమస్యలను ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పడమే.’ అని భూమి పెడ్నేకర్ పేర్కొన్నారు.
మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదాలు
Related tags :