ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలో కాకరేపుతోంది. నిన్న ప్రధాని మోదీకి అభివాదం చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును సీఎం జగన్ విజయవాడకు పిలిపించారు. ఢిల్లీ నుంచి హుటాహుటిన విజయవాడ చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆ పార్టీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి అనుమతి లేకుండా ప్రధానిని, కేంద్రమంత్రులను కలవకూడదని ఆదేశించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో గళమెత్తారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అధిష్టానానికి కోపం తెప్పించాయి. తాజాగా ఆయన.. ప్రధాని మోదీతో సంభాషించడం కూడా పార్టీకి తలనొప్పి తెప్పించాయి. ఇంకోవైపు సుజనాచౌదరి మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి.. ఎంపీని పిలిపించి మాట్లాడుతున్నారని సమాచారం.
ప్రధానిని కలవాలంటే మిథున్‌రెడ్డి పర్మిషన్ తప్పనిసరి
Related tags :