* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి పార్టీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి,తెలుగుఅకాడమి ఛైర్ పర్సన్ శ్రీమతి లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పాయింట్స్ -నిరక్షరాస్యత ను రూపుమాపడనికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కంకణం కట్టుకున్నారు.. -పాదయాత్ర సందర్భంగా పేదలు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని కోరారు.. -బడుగు బలహీన వర్గాలు కోసం ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టారు.. -ఇంగ్లీష్ మీడియం పెట్టడం వలన తెలుగు భాష నష్టపోదు.. -ప్రైవేట్ స్కూల్స్ లో అంతా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారు.. -నారాయణ,శ్రీ చైతన్య స్కూల్స్ కోసం 6 వేల ప్రభుత్వ పాఠశాలను గతంలో చంద్రబాబు మూయించారు.. – ప్రైవేట్ స్కూల్స్ పేదల నుంచి లక్షల రూపాయల దోచే దోపిడీ నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కాపాడుతున్నారు… -తెలుగు గురించి మాట్లాడే వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూల్స్ చదివిస్తున్నారు.. -నాకు, వెంకయ్య నాయుడుకు అవకాశము ఉంటే వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని గతంలో చంద్రబాబు చెప్పారు… -దీన్ని బట్టి తెలుగు రాష్ట్రం అంటే చంద్రబాబు కు ఎంత ఇష్టం ఉందొ.. -తెలుగు భాషాకు ప్రాచీన హోదా కోసం ఎందుకు చంద్రబాబు కృషి చేయలేదు.. -భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబు నాయుడు.. -పొలిట్ బ్యూరోలో తీర్మానం చేసి రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం కు లేఖ చంద్రబాబు ఇచ్చారు.. -తెలుగు జాతి గౌరవాన్ని కాపాదిండి ఎన్టీఆర్.. అటువంటి ఎన్టీఆర్ కు భారత రత్న కోసం ఎందుకు కృషి చేయలేదు.. -ఇంగ్లీష్ మీడియంలో పట్టు లేక అనేకమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.. -ఎన్టీఆర్ మనసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయంను ఎందుకు రాష్ట్రానికి చంద్రబాబు తేలేకపోయారు.. -తెలుగు అభివృద్ధి కోసం చంద్రబాబు చేసింది ఏమిటి.. -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరపలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు.. -అమరజీవి పొట్టి శ్రీరాములు కు నివాళులు కూడా అర్పించలేని పరిస్థితి లో చంద్రబాబు ఉన్నారు.. -తెలుగు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదు.. -లోకేష్ తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు.. -పిల్లలు భవిష్యత్ గురించే ఇంగ్లీషు మీడియంను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రవేశపెట్టారు.. -అమ్మ లాంటి తెలుగు భాషకు మా ప్రభుత్వం అన్యాయం చేయదు.. -ఏబీఎన్ రాధాకృష్ణ తన కుమారుడుని తెలుగు మీడియంలో చదివించారా.. -ఈనాడు రామోజీరావు తన జర్నలిజం కాలేజీని తెలుగులో పెట్టారా.. -వెంకయ్యనాయుడు ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం వలనే ఉన్నత పదవులు సాధించారు.. -చంద్రబాబు తన కుమారుడిని మనవడని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదా.
* టీటీడీ బోర్డ్ మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పాయింట్స్… రాష్ట్రంలో రాజకీయలన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి మంత్రి కొడాలి నాని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆజ్యం పోశారు మంత్రి కొడాలి నాని అసభ్య పదజాలంతో మాట అదుపుతప్పి టీటీడీ పై విమర్శలు చేసారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా వ్యాఖ్యలు చేశారు అన్యమతస్థులు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారి దర్శనానికి వెళ్లారు మంత్రి కొడాలి నాని భాష దారుణంగా ఉంది భేషరుతు క్షమాపణ చెప్పాలని బీజేపీ తరపున ఆడిగాం గతంలో విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు పై విమర్శలు వచ్చిన సమయంలో వైసీపీ నేతలు 200కోట్లకు పరువునష్టం దావా వేశారు రెండు కోట్ల రూపాయలు కూడా వైసీపీ నేతలు డిపాజిట్ చేశారు టీటీడీ పై విమర్శలు చేసిన మంత్రి నానిపై ఇప్పుడు ఎందుకు పరువునష్టం దావా వేయరు రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది టీటీడీ నిధుల్ని ప్రభుత్వం తీసుకొని ఆ నిధుల్ని జెరూసలేం యాత్రకు ఇస్తున్నారు రాష్ట్రంలో చాలా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేవు మంత్రి నాని కి చేవనైతే అన్యమతస్థులను తొలగించాలని సీఎం జగన్ కు చెప్పే ధైర్యం కొడాలి నాని కి ఉందా భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగారు రాష్ట్రంలో రాజకీయాలు దిగజారాయ్ భార్య ,పిల్లల్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు ఇదేం రాజకీయం టీటీడీ నిధుల్ని ఇతర వాటికి వాడకుండా చూడాలి హిందువులలో కూడా పేదలు ఉన్నారు దివ్యదర్శనం రద్దు చేసింది హిందువులు కుడా దేవుని దర్శనాలకు వెళ్ళేందుకు నిధులు ఇవ్వండి ఒక వర్గం,ఒక మతం ఓట్లు కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది టీటీడీ పరిరక్షణ కోసం ఉద్యమిస్తాం దేవాలయాల భూములు అమ్మితే ఊరుకునే ప్రసక్తి లేదు
* జిల్లా అభివ్రుద్ధిపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన ముగిసిన కృష్ణా జిల్లా సమీక్ష సమావేశం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ కృష్ణా జిల్లా ఇంచార్జిగా మొదటి సమావేశం నిర్వహించా. జిల్లాలో సమస్యల పరిష్కారానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకున్నాం విజయవాడలో పెండింగ్ ప్రాజెక్టులుపై చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సమస్య పరిష్కారం అవుతుంది . రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు ముగిసాయి ఇసుక ఇకపై సమస్య ఉండదు. 5ఏళ్లకు సరిపడా ఇసుక స్టాక్ యార్డుల్లో అందుబాటులో ఉంది.
* గుంటూరు జిల్లా లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన నరసరావుపేట నియోజికవర్గం,రామిరెడ్డి పాలెం గ్రామం లో వైకాపా నాయకుల వేధింపులు కారణంగా పోలీస్ కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న కోటిరెడ్డి ని నరసరావుపేట సబ్ జైలు లో కలిసి పరామర్శించిన నారా లోకేష్
* తనపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు పత్రికలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం లోక్‌సభ స్పీకర్‌తో పాటు సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశంలో తనకు క్లాస్ తీసుకున్నారని దురుద్దేశ పూర్వకంగా కథనాలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జర్నలిజం ఎథిక్స్ ప్రకారం కనీసం తనని సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాన్ని ప్రచురించారన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తప్పుడు సమాచారం ప్రచురించినందుకు సదరు పత్రిక రిపోర్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. అలాగే వారికి సంబంధించిన పార్లమెంట్లు ఎంట్రీ పాసులు రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచురించడం వల్ల ఎంపీగా తనకే కాకుండా పార్లమెంటు వ్యవస్థను సైతం అవమానపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
* నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలి: సీఎం జగన్ ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం జగన్ గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృష్టిపెట్టి ఫోకస్‌గా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నవరత్నాల అమలే తమ ప్రభుత్వానికున్న ఫోకస్ అని స్పష్టం చేశారు. ప్రతి పథకాన్ని సంతృప్తస్థాయిలో అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. నిధులను అక్కడ కొంత, ఇక్కడ కొంత ఖర్చు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదని, ప్రణాళిక ప్రకారం పథకాల అమలు జరగాలని ఆదేశించారు. అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ‘మేనిఫెస్టో ద్వారా ప్రాధాన్యతలేంటో చెప్పాం. కాబట్టి అందరి వద్ద మేనిఫెస్టో ఉండాలి. 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించి, అధ్యయనం చేసి ఈ మేనిఫెస్టోను తయారుచేశాం. ఏసీ గదుల్లో ఉండి తయారు చేసింది కాదు. ప్రతి హామీ కూడా ప్రజల వినతుల నుంచి, క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితుల నుంచి, వెనకబడ్డ వర్గాల వేదన నుంచే వచ్చింది. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలమో ఆలోచనలు చేయాలి. ఢిల్లీలో ఉన్న మన అధికారుల సేవలను బాగా వినియోగించుకోవాలి. కేంద్రం నుంచి వీలైనన్ని నిధుల్ని తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రిగా నేను ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుతమిచ్చే హామీనే అని గుర్తుపెట్టుకోవాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే విధంగా జిల్లాల పర్యటనల సందర్భంగా తాను ఇచ్చే హామీల అమలుపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ‘జనవరి- ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చే వినతులపైన హామీలు ఇస్తాం. ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలి. మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి. ఎలాంటి తాత్సారం ఉండకూడదు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదు. విశ్వసనీయత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలి. ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా నేను ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే ఈ ప్రభుత్వం మరోసారి ఎన్నికవుతుంది. మేనిఫెస్టోను అమలు చేయగలిగితే.. ప్రజలకు మేలు చేసినట్టే అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు.
* వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. బూతులు వాడే వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారో జగన్ సమాధానం చెప్పాలి నవ్విపోదురుగా నాకేంటి అన్న రీతిలో మంత్రి వ్యవహరించటం సరికాదు 2004లో కొడాలి నానికి సీటిచ్చి ఎమ్మెల్యేని చేయటం చంద్రబాబు చేసిన తప్పు అప్పుడు సీటివ్వకుండా ఉంటే లారీలు తోలుకుంటూ ఉండేవారు హిందూ దేవాలయాల్లోకి అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని 1990లో జారీ అయిన జీవో నెంబర్ 311 స్పష్టం చేస్తోంది ప్రభుత్వ జీవోలు చదవాలన్న అవగాహన ముఖ్యమంత్రి, బూతుల మంత్రికీ లేదు రాజ్యాగాన్ని వ్యతిరేకించి సీఎం ప్రవర్తిస్తుంటే ఏం చర్యలు తీసుకుంటారో సీఎస్ సమాధానం చెప్పాలి చంద్రబాబు తల్లిదండ్రులకు కొడాలి నాని క్షమాపణ చెప్పాలి చట్ట ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వనందుకు జగన్ క్షమాపణ చెప్పాలి