Movies

రష్మిక భయాలు

What Is Rashmika Scared Of-Telugu Movies News

‘‘చూడ్డానికి నేను ఎంతో ధైర్యవంతురాలిగా కనిపిస్తా. కానీ లోపల చాలా భయాలుంటాయి. కానీ వాటినెప్పుడూ బయటపెట్టుకోను’’ అంటోంది రష్మిక. అవేంటి? అని అడిగితే… ‘‘నాకు బైక్‌ రైడింగ్‌ అంటే భయం. బైక్‌ నడపడమంటే ఓకే. ఎందుకంటే హ్యాండిల్‌ మన చేతుల్లోనే ఉంటుంది. వేగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. కానీ వెనుక కూర్చోలేను. ఖాళీ రోడ్లపై బండి నడపడం ఇంకా భయం. పది మంది ముందు మాట్లాడాలంటే భయం. తప్పులు చెప్పేస్తానేమో అనిపిస్తుంది. నాకిచ్చిన బాధ్యతని నేను సక్రమంగా నెరవేరుస్తానా? లేదా? అంటూ ఆందోళన చెందుతుంటాను. ‘రష్మిక ఇది సరిగా చేయలేకపోయింది’ అని సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అనుకోకూడదు. ఇవన్నీ నన్ను భయపెట్టే అంశాలే. కానీ.. ఈ భయం ఉండడం వల్లే చాలా జాగ్రత్తగా పనిచేస్తుంటాను. గెలవాలన్న తపన ఇంకాస్త పెరుగుతుంది’’ అని చెప్పింది రష్మిక.