టెస్టు క్రికెట్లో ఓ బంతితో 80 ఓవర్లు వేశాక ఫీల్డింగ్ జట్టు దాని స్థానంలో కొత్త బంతిని తీసుకోవచ్చు. అలా తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. కానీ చాలా వరకు పాత బంతితో వికెట్లు తీయడం కష్టమవుతుంది. ఆటను మరింత ఆసక్తికరంగా మార్చడం కోసం, బ్యాట్స్‌మెన్‌తో సమానంగా బౌలర్లకు పోటీపడే అవకాశం ఇవ్వడం కోసం ఇలా 80 ఓవర్ల తర్వాత బంతిని మార్చుకునే వెసులుబాటు కల్పించారు. అయితే పాత బంతే ప్రయోజనకరం (టర్నింగ్, రివర్స్‌స్వింగ్) అని ఫీల్డింగ్ జట్టు భావిస్తే.. దాని పరిస్థితి బాగున్నంత వరకు (దీన్ని అంపైర్ నిర్ణయిస్తాడు) ఎన్ని ఓవర్లయినా బౌలింగ్ చేయవచ్చు. అయితే సాధారణంగా ఏ జట్టయినా 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి వైపు మొగ్గుచూపుతుంది. దీంతో ఆట స్వరూపమే మారిపోయే అవకాశముంటుంది. ఎందుకంటే కొత్త బంతితో ఫాస్ట్‌బౌలర్లు ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలుగుతారు. పిచ్, వాతావరణం సహకరిస్తే సీమ్, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టిస్తారు. ఒకవేళ 80 ఓవర్ల లోపు బంతి దెబ్బతింటే దాని స్థానంలో అన్నే ఓవర్లు ఆడిన మరో పాత బంతిని అంపైర్ ఇస్తాడు. ఒకే బంతితో 110 ఓవర్లు వేశాక.. బంతి దెబ్బతింటే మాత్రం బౌలింగ్ జట్టుకు కొత్త బంతిని ఇస్తారు.
ప్రతి 80ఓవర్లకు బంతి ఎందుకు మార్చాలి?
Related tags :