ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీలు ముప్పేటదాడికి దిగారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న సుజనా పరోక్ష వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు కౌంటర్లిస్తున్నారు. ఉదయం నుంచే సుజనాపై వైసీపీ ఎదురు దాడి చేస్తున్నారు. కావాలనే సుజనా గందరగోళం సృష్టిస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మండిపడ్డారు. వైసీపీ ఎంపీలంతా జగన్ విధేయులేనని, లేనిపోని ప్రచారంతో గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించారు. తమ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. చివరి శ్వాస విడిచే వరకు వైసీపీలోనే ఉంటానని రెడ్డప్ప స్పష్టం చేశారు. వైసీపీ తలుపులు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్యేలంతా చేరిపోతారని, ఏపీలో టీడీపీ బతికే పరిస్థితి లేదని రెడ్డప్ప అన్నారు. సుజనాచౌదరిపై ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ సారి సుజనా వెరైటీ ప్రెస్‌మీట్ పెడితే బాగుంటుందన్నారు. విలేకరులను కాకుండా తాను వేల కోట్లు ముంచేసిన.. అరడజను బ్యాంక్‌ల అధికారులతో ప్రెస్‌మీట్ పెట్టాలన్నారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెబితే.. ఆయన పార్టీ ఎందుకు మారాడో, టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మార్చాడో.. అన్నీ అర్థమవుతాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సుజన ప్రెస్‌మీట్ చూస్తుంటే బీజేపీ వేరు.. బాబు జనాల పార్టీ వేరని అర్థమైందని విజయసాయిరెడ్డి చెప్పారు.
సుజనాపై వైకాపా ఎంపీల మాటల దాడి
Related tags :