ScienceAndTech

ఆండ్రాయిడ్‌ను బద్ధలుకొట్టండి-కోట్లు కొల్లగొట్టండి

Android Waiting To Give Away Millions For Its Code Breakers

మీరు కోడింగ్‌లో కింగా? ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అవగాహన ఉందా? ఆండ్రాయిడ్‌లో ఎంతంటి సమస్యనైనా ఇట్టే గుర్తించగలరా? అయితే ఒక మిలియన్ డాలర్లు (రూ.పది లక్షలు) ఇక మీ సొంతమే. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బంపర్ ప్రైజ్ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ సొంత బ్రాండ్ ఫిక్సల్ స్మార్ట్ ఫోన్లను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వినియోగదారుల సౌకర్యార్థం గూగుల్ తమ ప్రొడక్టుల్లో తిష్టవేసిన బగ్స్‌ను ఎప్పటికప్పుడూ ఫిక్స్ చేస్తూనే ఉంటుంది. కొత్త కొత్త అప్ డేట్స్ తీసుకొచ్చి స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరింత ఈజీ ఎక్సీపీరియన్స్ అందిస్తోంది. గూగుల్ బగ్ బౌంటీ ప్రొగ్రామ్ కింద గూగుల్ టాప్ ప్రైజ్ ఆఫర్ చేస్తోంది. ఫిక్సల్ సిరీస్‌లో కెమెరాలో బగ్ ఎక్కడుందో కనిపెట్టడండి అంటూ సవాల్ విసిరింది. 

హ్యాకర్లే కాదు.. ఆండ్రాయిడ్ సిస్టమ్ పై అవగాహన ఉండి సెక్యూరిటీ రీసెర్చర్లు అయితే మీరైనా కనిపెట్టొచ్చు అంటోంది. 1 మిలియన్ డాలర్లు (పది లక్షలు) ఆఫర్ చేస్తోంది. ఫిక్సల్ ఫోన్లలో యూనిక్ బగ్ ఎక్కడ ఉందంట. ఈ బగ్ కనిపెడితే అదనంగా 50 శాతం బోనస్ ఆఫర్ చేస్తోంది. స్పెషిఫిక్ డెవలపర్ ప్రీవ్యూ వెర్షన్ ఆండ్రాయిడ్ పై బగ్ గుర్తించిన సెక్యూరిటీ రీసెర్చర్లకు 1.5 మిలియన్ డాలర్లు రివార్డు ఇస్తానంటోంది. గూగుల్ టైటాన్ M సెక్యూర్ ఎలిమెంట్ ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. ఇదివరకే, ఆండ్రాయిడ్ సిస్టమ్ పై గూగుల్ మొదటిసారి బగ్ బౌంటీ ప్రొగ్రామ్ ప్రవేశపెట్టింది. సెక్యూరిటీ రీసెర్చర్లు గూగుల్ ఫిక్సల్ స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో బగ్ ఉన్నట్టు గుర్తించారు. దీనిద్వారా ఈజీగా యూజర్ల డివైజ్ ను స్పై చేసే అవకాశం ఉందని తెలిపారు. కనిపెట్టిన వారికి గూగుల్.. బౌంటీ రివార్డు 38వేల డాలర్లను చెల్లించింది. బగ్ బౌంటీ ప్రొగ్రామ్‌లో గూగుల్ అందించిన అతిపెద్ద బౌంటీ రివార్డు తెలిపింది.