* వైస్సార్సీపీ తలుచుకుంటే కేంద్రంలో బీజేపీ కుప్పకూలుతుంది అని తీవ్ర హెచ్చరిక చేసిన వైస్సార్సీపీ అధికార ప్రతినిధి ఒక ప్రముఖ ఛానెల్లో వైసీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు అవుతున్నాయి. “ఏ రాష్ట్రములో అయిన వేషాలు వెయ్యండి,కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జోలికి వొస్తే మటుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది” గత కొన్ని రోజులుగా రాజకీయ సమీకరణాలు మారుతున్న తిరునిబట్టి, వైసీపీ ప్రభుత్వం కొంత దూకుడు పెంచింది అనే చెప్పాలి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారు అని కొందరు బీజేపీ నాయకులు వరుస లీకులు ఇవ్వడం, వైసీపీ పార్లమెంట్ ఇంఛార్జిలు విజయసాయిరెడ్డి, మితున్ రెడ్డి సమాచారం లేకుండా కేంద్ర నాయకులను వైసీపీ నాయకులు కలవడం చూస్తుంటే బీజేపీ మీద వైసీపీ దూకుడు పెంచాలి అనే నిర్ణయం తీసుకున్నట్లుగా,అందుకే ఈ హెచ్చరిక చేసినట్టుగా మేధావులు అనుకుంటున్నారు. దీని వెనక సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు బీజేపీ మీద దూకుడు పెంచాలి అని సూచనలు వైసీపీ నాయకులకు అందినట్టుగా అనుకుంటున్నారు.
* రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్టపతి రామనాథ్ కోవింద్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. గిరిజన సమస్యలు, వ్యవసాయంలో సంస్కరణలు, జల్ జీవన్ మిషన్, ఉన్నత విద్యలో కొత్త విద్యా విధానం, సులభతర జీవనానికి కావలసిన పాలన తదితర అంశాలపై చర్చించనున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఇది రాష్ట్రపతి అధ్యక్షతన జరుగుతున్న 50వ గవర్నర్ల సదస్సు కాగా, రామనాథ్ కోవింద్ అధ్యక్షతన మూడోది.
* ట్విట్టర్ లో టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ…. కరకట్ట కమల్ హాసన్ ప్రతిపాదించారు.మంత్రులు,ఎమ్మెల్యేలు జై కొట్టారు. మరి జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు గారిని ఉరి తియ్యాలి,నడి రోడ్డు పై కాల్చాలి అంటూ మాట్లాడినప్పుడు ఈ కరకట్ట కమల్ హాసన్ ఎక్కడ ఉన్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు?ఆ రోజు నొప్పి తెలియలేదా? డిఆర్సీ సమావేశాలు లోకేష్ ని పిలవకూడదు అన్న మీ నిర్ణయంతోనే లోకేష్ అంటే మీకు ఎంత భయమో బయటపెట్టుకున్నారు. డిఆర్సీ సమావేశాలకు పిలవకుండా అడ్డుకోగలరు ఏమో?లోకేష్ కి ప్రజల్లో పెరుగుతున్న మద్దత్తు ని అడ్డుకోవడం మీ తరం కాదు
* మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసాయి.రాజకీయ విలువలు తుంగలో తొక్కుతున్నారు.కాంగ్రెస్-ఎన్సీపి-శివసేన లది కూడా అపవిత్ర కలయికేనని, ఎన్నికలలో శత్రువులగా పోటీ చేసి ఫలితాల తర్వాత అధికారమే పరమావదిగా పోత్తులు ఎంటని, రాష్ట్రపతి పాలన అమలు ఉండగా సీఎం ప్రమాణ స్వీకారం రాజ్యాంగ విరుద్దమని,ఆర్ఎస్ఎస్ వ్యక్తి రాష్ట్రపతిగా ఉండటం వల్లే ఇంలాంటి పరిణామాలని, పార్టీ మారిన అభ్యర్థులకు తక్షణమే వారి పదవి రద్దు కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య చేప్పాడని, మహారాష్ట్ర లో నడి రోడ్డు పై రాజకీయ వ్యభిచారం జరుగుతుందని పవర్ – మోడీతో చేసుకున్న ఒప్పందం లో బాగంగానే ఈ కలయిని, ఎంతటి డెటాయిట్ అయినా బిజేపి తో కలిస్తే పవిత్రుడు అవుతున్నాడని,ఇలాంటి అపవిత్రమైన రాజకీయాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని, ఇతర పార్టీ ల నేతలు బిజేపి తో టచ్ లో ఉన్నారని ప్రకటన బహిరంగ వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అమ్మి జగన్ పాలన చేయాలని చూస్తున్నారని పంట పండించకుండా విత్తనాలి దంచుకోని తినడం ఎంత పాపమో….జగన్ ఆస్తుల అమ్మకం కూడా అలాంటిదేనని, ప్రజా సమస్యలపై మాట్లాడితే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని,మాతృభాష తప్పకుండా ఉండాల్సిందేనని, విధానాలు మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని, టిడిపి ఇంగ్లీష్ ప్రవేశ పెడితే యార్లగడ్డ గగ్గోలు పెట్టారని, మేధావులు కూడా భజనలు చేస్తే సమాజానికి నష్టమని, కుర్రాడు కాబట్టి జగన్ బెస్ట్ సీఎం కావాలనుకోవడం మంచిదేనని,పాలన రివర్స్ లో వెళ్లడం బెస్ట్ పాలన అనిపించదని,ఇంతకు ముందు సినిమా హాల్ వద్ద బ్లాక్ టికెట్ల కోసం కొట్లాడుకునేవారు బ్లాక్ టికెట్ల అమ్మే వారి మాదిరిగా నేడు రాజకీయ నేతలు కోట్లాడుకుంటున్నారని,అయ్యప్ప మాల వేసుకోని అసభ్య దూషణలు చేసుకుంటున్నారని, 1ఏపిలో సభ్యత మరిచి విమర్శలు చేసుకుంటున్నారని,వైజాగ్ భూ కుంభకోణం లో టిడిపి – వైసిపి ఇద్దరు దొంగలేనని పార్టీ మార్పులలో చంద్రబాబు చేసిన పనే జగన్ చేస్తున్నారని, బాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు. బిజేపికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై దేశం నుంచి తరిమేందుకే ఎన్ఆర్సీ అని, అయోధ్య తీర్పును స్వాగతిస్తున్నామని, బాబ్రీ మసీదు కూల్చివేసిన వారిపై చర్యలు ఉంటేనే అయోధ్య తీర్పు కు న్యాయం జరుగుతుందని, బిజెపి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ…రాజధాని విషయం బొత్స నోటికి తాళం వేసుకోవడం మంచిదని, రాజదాని తరలించే ఆలోచన ప్రభుత్వం మానికోవాలని,దేశ పటంలో ఏపి రాజదాని అమరావతి లేకపోవడం కేంద్రం తప్పిదమని, సర్వే శాఖ సిబ్బంది చేసిన తప్పిదం సరిచేసుకుందని,ఇందులో ఎంపీ గల్లా జయదేవ్ గొప్ప ఏమి లేదని,గల్లా జయదేవ్ గొప్ప లాగా డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
* మంగళగిరి మీడియాతో ఏపీ స్పీకర్ సీతారాం… … శాసనసభ్యులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి… ముందుగా నేను శాసన సభ్యుని ఆ తర్వాతే అసెంబ్లీ స్పీకర్ ని…..శాసనసభ్యుడిగా సమస్యలపై మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంది…. అసెంబ్లీ స్పీకర్ చైర్ ను అగౌరవపరిచే విధంగా ఎవరు మాట్లాడకూడదు… అసెంబ్లీ స్పీకర్ అంశాన్ని రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించాడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం..
* కడప జిల్లాలో రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటిరెడ్డి కూడలి నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమైంది. సీమ జిల్లాల్లో 700 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ సాగనుంది. ఉద్యమకారులు, మేధావులు, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.
* ఏలూరు మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆఫ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని,,, గత టిడిపి ప్రభుత్వం రైతులును దగా చేసిఒ ది,,, 100కేజీ ల ధాన్యం కొనుగోలు కు గిట్టు బాటు ధర కల్పించిన ఘనత ఆఫ్ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది,,, రైతులును ఎన్నికలు కు వాడుకొని మొండి చేయి చూ పిఒ సిన ఘనుడు మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు,,, కోమడ ఓలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు 5లక్షలు నిధులు ఇస్తాము,,, మార్కెట్ యార్డ్ లో రైతులు అందరికి అండగా ఉంట్టాను,, రైతులు తనను ఎప్పుడు అయినా కలవచ్చు… మీ సమస్యలు ఏమి ఉన్న పరిష్కారం చేస్థా… రైతులుకు రైతు భరోసా అమలు చేసిన ఘనత ముఖ్య మంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డిదే.
* మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదన్నారు. అజిత్ పవార్ని తాము సమర్థించడం లేదన్నారు. ఈ మేరకు ఆయన తాజా పరిణామాలపై ట్విటర్ వేదికగా స్పందించారు. మరోనేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. భాజపాతో కలిసి నడవడం ఎన్సీపీ పార్టీ నిర్ణయం కాదన్నారు. దీనికి శరద్ పవార్ మద్దతు లేదని వెల్లడించారు.
* తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు… జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 25న జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న సమీక్షల్లో పాల్గొననున్నారు. 26న వైకాపా బాధిత కుటుంబాలతో సమావేశంకానున్నారు. 27న తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు తెదేపా నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.