తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేర్చినందుకు హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం ఈనెల 2న విడుదల చేసిన మ్యాప్‌లో అమరావతి లేకపోవడంతో ప్రజలు ఆవేదన చెందారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 2015 అక్టోబరు 22న అమరావతి శంకుస్థాపన జరిగింది. మ్యాప్‌లో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రజా రాజధాని లేకపోవడం బాధించింది’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. సమస్యను తెదేపా ఎంపీలు పార్లమెంట్ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరువురు మంత్రులకు లేఖలు రాశారు.
మోడీ గారికి….నా ధన్యవాదాలు-ఇట్లు చంద్రబాబు
Related tags :