‘దశవతారం’ చిత్రంతో 10 పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచారు విశ్వనటుడు కమల్ హాసన్. తాజాగా ఆయన రికార్డును ప్రముఖ నటుడు విక్రమ్ బద్దలుకొట్టనున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను ధరించడంలో ఎప్పుడూ ముందుండే విక్రమ్ ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి.. విక్రమ్ సరసన కనిపించనున్నారు. ప్రదీప్ రంగనాథన్, కె.ఎస్.రవికుమార్, క్రికెటర్ ఇర్ఫాన్‌ఖాన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘చియాన్ 58’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విక్రమ్ 20 పాత్రల్లో కనిపించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను క్రిస్మస్ పండుగనాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విక్రమ్ ఇప్పటికే ‘అపరిచితుడు’, ‘ఐ’ చిత్రాలలో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యపరమైన సమస్యలు కూడా లెక్క చేయలేదు.
చియా..నువ్వు సూపర్‌యా
Related tags :