* విజయనగరం : జిల్లాలో చాలాకాలంగా చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న ఇద్దరు నిందుతులను సిసిఎస్, వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం విజయనగరం సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ… జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు నిందితులను సిసిఎస్, వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి వద్ద నుండి పలు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 30 తులాల బంగారు ఆభరణాల విలువ రూ.10 లక్షలు 80 వేలుగా ఉండవచ్చని అంచనా వేశారు. విజయనగరం పట్టణానికి చెందిన పొట్నూరు వెంకటేష్ (21), చల్ల మహేంద్ర (20) లు పట్టణంలో అనుమాస్పదంగా తిరుగుతుంటే వారిని సిసిఎస్, వన్‌టౌన్ పోలీసులు పట్టుకొని విచారించగా, వారు చైన్‌స్నాచింగ్ కి పాలడుతునట్లు విచారణ లో తేలిందని ఎస్పీ బి.రాజకుమారి స్పష్టం చేశారు.
* నిన్న భూవివాదానికి సంబంధించి టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జగత్ విఖ్యాత్ రెడ్డి ఓ వీడియో ద్వారా స్పందించారు. పొద్దున్నుంచి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని.. నేనేదో కేసులు వేశానని చెబుతున్నారు. నేను దుబాయ్ లో ఉండటం వల్ల ఎవరికీ అందుబాటులోకి రాలేకపోతున్నానని, మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి. అవన్నీ అసత్యాలేనని, తామంతా కలిసే ఉన్నామని, భూమా కుటుంబాన్ని, భూమా కేడర్ ని ఎలా బలపరచాలా అనే మేమంతా ఆలోచిస్తామే కానీ… మచ్చ వచ్చే పనులేవీ తాము చేయమని.. మీడియాలో వచ్చే వార్తలను దయచేసి నమ్మకండి అంటూ జగత్ విఖ్యాత్ రెడ్డి తెలిపారు
* కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ వీరాసింగ్ (25) అనే యువకుడు, ఎలిగేడు మండలం నారాయణపల్లికి చెందిన వై.లయామాధురి (19) ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవలే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి పెద్దలు అంగీకరించరేమోనని మనస్తాపానికి గురై శుక్రవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వీరిని బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయారు. వీరాసింగ్ వరంగల్ ఎంజీఎమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా..లయామాధురి కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఈ మేరకు ఎస్సై ప్రశాంతరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామం లో యువకుడి దారుణ హత్య. కాళ్లు చేతులు కట్టేసి డ్రైనేజీలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
* ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల పట్టివేత.ఇసుక దిగుమతి చేసే పాయింట్ లో అవకతవకలు.SB పోలీసుల సమాచారం మేరకు తాడేపల్లి పోలీసుల దాడులు
* హైదరాబాద్ కొండాపూర్‌లో దారుణం జరిగింది. మసీదు బండ సమీపంలో పాస్టర్ సత్యనారాయణరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హతుడు అనంతపురం హౌసింగ్‌బోర్డు కాలనీ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే పాస్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు సమాచారం. అతని హత్యకు భూ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* గుంటూరులో డ్రగ్స్ కలకలం రేపింది. నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఓ అపార్ట్మెంటులో రహస్యంగా డ్రగ్స్ . ఆన్లైన్లో విక్రయాలు చేస్తున్నారు. వీరిని నల్లపాడు సిఐ వీరాస్వామి వలపన్ని పట్టుకున్నాడు. డ్రగ్స్ తయారీకి సంబంధించి సౌదీ దేశస్తుడు షాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాజీ ప్లాట్‌లో బొమ్మ చేతులు, గ్లౌజ్‌లు, ముఖం మాస్క్‌లు లభ్యమయ్యాయి.
* డాక్టర్ ముసుగులో మహిళలతో అక్రమ సంబంధాలు సాగిస్తున్న కీచకుడి భరతాన్ని ఓ ఎన్నారై బట్టబయలు చేశాడు. బోడుప్పల్ ఆర్బీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శివప్రసాద్.. ఎన్నారై సంతోష్‌రెడ్డి భార్య సమతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వాసవి కాలనీలో ఓ ఇంట్లో శివప్రసాద్.. సమతతో కలిసి ఉండగా సంతోష్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్ పట్టుకున్నాడు. ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చైతన్యపురి పోలీస్‌స్టేషన్ ఎదుట డాక్టర్ శివప్రసాద్ అనుచరులు హల్చల్ చేశారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. డాక్టర్ ముసుగులో శివప్రసాద్ అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని సంతోష్‌రెడ్డి ఆరోపించారు.
* సర్పవరం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో ఆత్మహత్యాయత్నికి పాల్పడిన 10వతరగతి విద్యార్ది. ఉపాద్యాయుల వేధింపుల కారణంగా రాకెష్ ( 15 ) అనే విద్యార్ది పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నం. వేధింపులకు గురిచేస్తున్న ఉపాద్యాయులపై చర్యలు తీసుకోవాలని రాకేష్ తల్లిడ్రులు, స్థానికుల ఆందోళన. విచారణ చేపడుతున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు.
* అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో ధారుణం చోటుచేసుకుంది. గ్రామంలో ఆస్తి తగాదాలతో రాజ కుల్లాయప్ప (40) అనే వ్యక్తిని అతని సొంత అన్న రామాంజనేయులు చంపినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సంఘటన గ్రామ శివారులోని తోటలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. శరీర భాగం నుండి మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేసిన రామాంజనేయులు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
* రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగౌర్‌లోని కుచమాన్లో తెల్లవారు జామున 3 గంటల సమయంలో రెండు మినీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
* కూకట్పల్లి 9థ్ MM కోర్టులో లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడిన బెంచ్ క్లర్క్. రెండు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా బెంచ్ క్లర్క్ శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు.
* ఖమ్మంలో 50వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.అఖిల పక్ష పార్టీలు, ఆర్టీసీ జెఎసి పిలుపు మేరకు ఖమ్మం బస్ డిపో నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ అనంతరం ఆర్టీసీ కార్మికులు బస్ స్టాండ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నచటంతో,పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆర్టీసీ కార్మికులను అడ్డుకోవడం తో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.కొందరు పోలీసులు మహిళ కండక్టర్ పై ఆ అకారణంగా దాడి చేశారన్నీ ఆరోపించారు.ఆర్టీసీ కార్మికుల పై పోలీసులు వ్యవహరించిన తీరు పై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల డబ్బులను వాడుకొన్న ప్రభుత్వం, ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని, అందుకే ఆర్టీసీని ప్రైవేటు పరం చెయ్యాలని చూస్తోందని వారు విమర్శించారు. –అనిత(ఆర్టీసీ జేఏసీ నాయకురాలు), లాల్ బి(మహిళ కండక్టర్).
* Biodiversity flyoverపై నుండి పడిన కారు. కారులో ముగ్గురు వ్యక్తులు. కింద ముగ్గురు వ్యక్తులు మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రమాదంలో గాయాలు. వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెఙడో ప్రమాదం.