ఈ మధ్య కాలంలో ఫొటోగ్రఫీ వింత పోకడలకు పోతోంది. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, ప్రసవానికి ముందు, ఆ తర్వాత అంటూ కొంతమంది ఫొటో షూట్ జరుపుకుంటున్నారు. అయితే ఇది ఎవరి ఇష్టాయిష్టాలకు సంబంధించినదే అయినా….ఇక్కడ కొంత పైత్యం కనపడుతుండటంతో విమర్శల పాలవుతోంది. తాజాగా కేరళకు చెందిన ఓ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ జరుపుకుంది. ‘మడ్ లవ్’ పేరుతో ఆ కొత్త జంట.. బురదలో వింత వింత విన్యాసాలు చేసింది. బీను సీన్స్ అనే ఫొటో స్టూడియో సంస్థ ఈ ఫొటో షూట్ జరిపింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకంటే మంచి ఆలోచన వేరేది లేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తమిళ సినిమాలు ఎక్కువగా చూసుంటారని.. అందుకే ఈ విధమైన ఫోజులు పెట్టుంటారని విమర్శిస్తున్నారు.
మడ్ లవ్ పేరిట వింత ఫోటోగ్రఫీ విన్యాసాలు
Related tags :