Politics

DRC నుండి లోకేష్ బహిష్కరణ

Lokesh Banned From DRC

నారా లోకేష్‌కు జిల్లా వైసీపీ నేతలు షాకిచ్చారు.

సీఎం జగన్‌ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఇవాళ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు.

డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు

డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది.

జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జ్ మంత్రి రంగనాథ్‌రాజు, మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు