Sports

దాదాకు షేన్ వార్న్ ప్రశంసలు

Shane Warne Praises Saurav Ganguly

భారత్‌లో డే/నైట్‌ టెస్టును సాధ్యం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌, ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఎట్టకేలకు టీమిండియా ముందడుగు వేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్‌, బంగ్లా తొలిసారి గులాబి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐసీసీ 2015లో డే/నైట్‌ టెస్టులను ఆమోదించగా టాప్‌ టెస్టు దేశాల్లో 8 ఇప్పటికే వీటిని ఆడేశాయి. భారత్‌, బంగ్లా ఇన్నాళ్లకు ఆడుతున్నాయి.