దిట్టంగా కండలతో కనిపించే ఆ ఎద్దు బెల్జియం బ్లూ జాతి. ఇటలీకీ చెందిన పిడ్మాంటీస్ జాతి ఆవులతో, బెల్జియం మేలిమి జాతి ఎద్దుల్ని సంకరీకరించగా పుట్టినవే ఈ బెల్జియం బ్లూ జాతి . ఆ రెండు జాతులూ బలిష్టంగా ఉండటంతో ఈ సంతతికి కండలు రెండు పొరలు ఉంటాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ జాతిని మొదట్లో పాలకీ, వ్యవసాయానికీ ఉపయోగించేవారు. అయితే శరీరంలో ప్రొటీన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల కండలు ఏర్పడిన ఈ బెల్జియం బ్లూ పశువుల్లో కొవ్వు శాతం చాలా తక్కువట. అందుకే దీన్నిప్పుడు మాంసం కోసం ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఈ మాంసానికి డిమాండ్ ఎక్కువ. అంతేకాదు, బెల్జియం బ్లూ పశువులు కండలతో ఎత్తు తక్కువగా ఉండి… సహజంగా ప్రసవించలేవు. ఎక్కువ శాతం ఆపరేషన్ చేసే దూడల్ని బయటకు తీస్తారట. పాపం వీటికీ తప్పట్లేదు కదా సిజేరియన్లు.
బెల్జియం బ్లూ జాతి ఎద్దుల కష్టాలు
Related tags :