Food

బఠాణీతో అధిక బరువు ఖూనీ

Green Peas Helps In Losing Weight-Telugu Food And Diet News

బరువు తగ్గాలని రకరకాల ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు చాలామంది. వాటిల్లో తినకూడనివే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈ పదార్థాలను తింటే మాత్రం మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.

జామ: ఈ పండుని రోజూ టిఫిన్‌ తిన్న తరువాత తీసుకుంటే సరిపడా కెలొరీలు, పీచు, విటమిన్‌ సి పుష్కలంగా అందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అదనంగా కొవ్వు చేరదు.

క్యాలీఫ్లవర్‌: రోజూ కప్పు క్యాలీఫ్లవర్‌ని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. దీనిలో సుమారుగా రెండు గ్రాముల పీచు, అధికంగా కెలొరీలు ఉంటాయట. సి విటమిన్‌ ఎక్కువగా దొరుకుతుంది. ఇవన్నీ బరువుని అదుపులో ఉంచేవే.

పచ్చి బఠాణీలు: పీచు, విటమిన్లు, మాంసకృత్తులు, ఫోలిక్‌ యాసిడ్‌ వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. బఠాణీలను ఉడికించి సలాడ్లు, కూరల్లో వాడుకోవచ్చు. ఈ పోషకాలు బరువుని సులువుగా తగ్గిస్తాయి.