ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీనయ్య’. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా విడుదలైన వినాయక్ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అయితే ఈ సినిమా వినాయక్ సరసన ఎవరు కనిపించనున్నారనే విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ తరుణంలో ‘సీనయ్య’ సినిమాలో శ్రియ నటించనున్నారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాలో ఆమె వినాయక్ భార్యగా కనిపించనున్నారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో వినాయక్ దర్శకత్వంలో విడుదలైన ‘ఠాగూర్’, ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రాల్లో శ్రియ కథానాయికగా నటించారు.
శ్రియ సరసన వినాయక్
Related tags :