‘రాగల 24 గంటల్లో’ సినిమాతో తాజాగా మంచి హిట్ అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. దీని తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ‘భార్యదేవోభవ’ పేరుతో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు ఇందులో పది మంది హీరోయిన్లు నటించబోతున్నారని తెలిపారు. వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకుల్ని నవ్వించబోతున్నామని అన్నారు. ‘రాగల 24 గంటల్లో’ సినిమాను నిర్మించిన శ్రీనివాస్ కానూరు దీన్ని కూడా నిర్మించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. హాస్య ప్రధానమైన చిత్రాలతో విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ‘ఢమరుకం’తో ఆయన స్థాయి మరింత పెరిగింది. చాలా కాలం తర్వాత ఆయన ‘రాగల 24 గంటల్లో..’ వంటి థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్ అందుకుంది.
10మందితో “భార్యదేవోభవ”
Related tags :