Business

నాణ్యత లేదని ప్రత్యక్షంగా తెలుసుకున్న మస్క్

Elon Musk Throws Steel Ball At CyberTruck Shattering Its Windows

టెస్లా ఏం చేసినా సంచలనమే.. ఆ సంస్థ తాజాగా సైబర్‌ట్రక్‌ పేరుతో ఒక ఎలక్ట్రిక్‌ పికప్‌ట్రక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత కంపెనీ షేరు 6 శాతం పడిపోయింది. దీనికో కారణం ఉంది. సైబర్‌ ట్రక్‌ వివరాలను వెల్లడిస్తున్న సమయంలో దాని కిటికీ అద్దాలు అసలు పగలవని ఎలన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత దానిపై ఒక లోహపు గుండు విసిరి ప్రత్యక్షంగా దాని శక్తిని చూపాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ కిటికీ అద్దం పగిలింది. దీంతో మస్క్‌ షాక్‌కు గురైయ్యారు. ఈ ట్రక్‌ను మరింత మెరుగుపర్చాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో వాల్‌స్ట్రీట్‌లో టెస్లా షేర్లు దాదాపు 6శాతం పతనమయ్యాయి. దీనికి తోడు ఈ ట్రక్‌ డిజైన్‌ కూడా బాగోలేదని సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది. మరోపక్క టెస్లాకి పోటీగా విద్యుత్తు పికప్‌ ట్రక్‌ను 2021లో మార్కెట్లోకి తీసుకురానున్న జనరల్‌ మోటార్స్‌ షేర్లు 2శాతం పెరిగాయి.