DailyDose

ఇసుక కోసం తలకాయలు పగలగొట్టుకున్నారు-నేరవార్తలు-11/25

Guntur People Breaks Each Others Heads For Sand-Telugu Crime News-11/25

* రొమేనియా తీరం నుంచి 14 వేలకు పైగా గొర్రెలను తీసుకువెళ్తున్న భారీ సరకు రవాణా నౌక సముద్ర జలాల్లో తిరగబడింది. మునిగిపోతున్న నౌక నుంచి గొర్రెలను కాపాడేందుకు రక్షణ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ నౌక పేరు క్వీన్ హింద్. అది నల్ల సముద్రం తీరంలోని కాన్‌స్టాంటా నగరానికి ాగ్నేయంగా ఉన్న మిడియా ఓడరేవు నుంచి బయలు దేరింది. అందులో 22 మంది సిరియా జాతీయులైన సిబ్బంది ఉన్నారు. భారీ సంఖ్యలో నౌకలో ఉన్న గొర్రెలను కాపాడేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రొమేనియా తీర ప్రాంత రక్షణ దళాలు రంగంలోకి దిగాయి.

* ఓటుకు నోటు కేసులో.. మరోసారి సుప్రీం తలుపు తట్టిన ఎమ్మెల్యే ఆర్కే ఓటుకు నోటు కేసులో.. ఎర్లీ హియరింగ్ పిటీషన్ ను ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి(ఆర్కే) 2017లోనే ఈ పిటీషన్ దాఖలు చేసినా.సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోమారు సుప్రీం గడప తొక్కిన ఆర్కే.

* తహసీల్దార్ కార్యాలయంలో ….సమస్యలు పరిష్కారం చూపుతారా.. లేక పెట్రోలు పోసుకోమంట రా లేదా పోయాలా అంటూ ఓ రైతు ఆవేదన….. పెట్రోల్ పోసుకోబోయిన రైతుని అడ్డుకున్న అధికారు

* ‘దళిత కులాల మీద దాడులు జరిగినా.. చెప్పడానికి భయపడుతున్నారు. మిగతా వారు.. ముఠాలు చెప్పింది మౌనంగా వినటమే . పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధను వెళ్లబోసుకుంటే నా గుండె కలచి వేసింది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. సోమవారం నాడు ట్విట్టర్‌లో వరుస ట్వీట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాతృభాషపై ప్రధాని వ్యాఖ్యల కథనాన్ని పోస్ట్‌ పవన్‌ చేశారు. కడప జిల్లాల్లో పాలెగాళ్ల రాజ్యం పుస్తకాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. ఇదే పుస్తకంలో 75వ పేజీలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రస్తావన కూడా ఉందన్నారు. 1996లో ప్రచురించిన ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వస్తాయన్నారు. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. దళిత, వెనుకబడిన, మిగతా అన్ని కులాల సామాన్య ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారన్నారు. ఈ ముఠా సంస్కృతి వల్ల రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమవుతుందన్నారు. రాయలసీమలో మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉందని జనసేనాని చెప్పుకొచ్చారు.

* తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరపెడుతున్నాయి. ముక్కపచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. చిత్తూరు జిల్లా చిన్నారి వర్షిత హత్యాచారం రాష్ట్రంలో ఎంతటి చర్చకు దారితీసిందో తెలిసింది. ఓ వైపు కామాంధులను కఠినంగా శిక్షించాలని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై పదో తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. జిల్లాలోని కొయ్యలగూడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి గ్రామంలోని చర్చిలో డ్యాన్స్ నేర్చుకునేందుకు ఒంటరిగా వెళ్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పదో తరగతి చదువుతున్న బాలుడు బాలికను పలకరించాడు. ఎక్కడికెళ్తున్నావని అడిగి మాయమాటలతో ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసిన బాలుడు తిరిగి గ్రామానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. బాలిక ఏడుస్తుండటంతో స్థానికులు ఏం జరిగిందని అడగ్గా అసలు విషయం చెప్పింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

* బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిని చితకబాదిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. పశ్చిమ బెంగాల్‌లో ఖరగ్‌పూర్‌ సదర్‌, కలియాగంజ్‌, కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్‌ మజుందార్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జియాఘాట్‌ ఇస్లాంపూర్‌ ప్రైమరీ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు వచ్చిన జయప్రకాశ్‌పై తృణమూల్‌ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పోలింగ్‌ కేంద్రం బయట.. జయప్రకాశ్‌ను కాళ్లతో తన్నుతూ.. చెట్లలోకి తోసేశారు టీఎంసీ కార్యకర్తలు. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటన జరిగిన పోలింగ్‌ కేంద్రం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

* షీలానగర్, అయ్యప్ప స్వామి గుడి దగ్గర రెండు లారీల మధ్య లో చిక్కుకున్న మూడు కార్లు… దారుణమైన యాక్సిడెంట్.

* రాజమహేంద్రవరం –  పేపర్ మిల్లు ప్రాంతానికి చెందిన కోమలి లోకేష్ ని  ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.. దానవాయిపేట వెళుతున్న సమయంలో కొందరు యువకులు అడ్డగించి దాడి చేసి కారులో ఎక్కించుకుని పోయారు.. ఈ మేరకు యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యా దు చేశాడు… కిడ్నాప్ చేసిన నిందితులు ఓ ప్రజా ప్రతినిధి దగ్గర బంధువు ఉన్నట్లు తండ్రి ఆరోపిస్తున్నాడు..కేసు నమోదు చేసుకున్న ఒకటో టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలే కిడ్నాప్ కు కారణమని భావిస్తున్నారు.

* రెండున్నర కేజిల గంజాయి పట్టుకున్న తాడేపల్లి పోలీసులు… సీతానగరం లోటస్ వద్ద స్విఫ్ట్ కారును చేజ్ చేసి పట్టుకున్న తాడేపల్లి పోలీసు స్టేషన్ కు తరలింపు. హైదరాబాద్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గా గుర్తించిన పోలీసులు. కేసు నమోదుచేసిన పోలీసులు

* గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ వద్దగల అద్దంకి బ్రాంచ్ కెనాల్ లో స్నానానికి దిగి నరసరావుపేట మాజి ఎమ్మెల్యే దొందేటి కృష్ణారెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి ప్రమాదవశాత్తు గల్లంతు. ఆరేపల్లి గ్రామంలో తన పంట పొలాల లో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు వెళుతూ కార్తీక మాసం చివరి రోజు, చివరి సోమవారం కావటం తోదగ్గర లో ఉన్న సాయి బాబా దేవస్థానంలో పూజలు చేయించుకొని ఉద్దేశ్యం తో మార్గమధ్యంలో ఉన్న బ్రాంచి కెనాల్ వద్ద మెట్ల మీద స్నానం చేస్తుండగా జారి పడినట్లు తెలుస్తోంది.

* గుంటూరు జిల్లా తాడేపల్లి… గంజాయి అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుంది: సీఐ అంకమ్మరావు గత 4 నెలల్లో 8 గంజాయి కేసులు నమోదు చేయడం జరిగింది తల్లిదండ్రులు మీ పిల్లలు ఎవరైనా చెడు అలవాట్లకు బానిసలైతే మమ్మల్ని మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఖచ్చితంగా మత్తు పదార్దాలకు బానిసలైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పంపిస్తాం మారక ద్రవ్యాలు సేవిస్తూ మాకు పట్టుపడితే కేసులు నమోదు చేస్తాం మీ పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని మాకు తెలియపరిస్తే వారిని మంచి మార్గంలో ప్రయాణించే దిశగా కౌన్సెలింగ్ నిర్వహించి మంచి పౌరులుగా సన్మార్గంలో నడిపిస్తాం.

* తాడేపల్లి పట్టణం రామ్ హాస్పిటల్ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు. ఒక నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 8 మంది మహిళలు అరెస్ట్. లక్ష 36 వేల నగదు సీజ్… 8 మొబైల్స్ స్వాధీనం. పట్టుపడ్డ వారందరు మహిళలు కావటంతో చర్చమశానియంగా మారింది. ముగ్గురు వ్యక్తులు పరారీ.

* గుంటూరు జిల్లా కొల్లిపర మండలం సమీపంలోని అన్నవరపులంక రిచ్ వద్ద ఇసుక తవ్వకాల్లో వివాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయాయిన గ్రామస్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో దాడిచేసుగా ఇద్దరికి తలలు పగిలినట్లు సమాచారం. ఇసుక రిచ్ నిర్వహణలో పలు లోపాలు,అవకతవకలు జరుగుతున్నాయి అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ గొడవలు జరగడం జిల్లాలో హట్ టాపిక్ గా మారింది.ఈ నేపథ్యంలో ఇసుక గొడవ పంచాయతీ ఆదివారం సాయంత్రం కొల్లిపర పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. ముగ్గురు ఎస్ఐలు ఒక సీఐ పలువురు వైసీపి నాయకులు గ్రామస్థులు పాల్గొని సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నట్లు సమాచారం.

* తాడేపల్లిలోని పట్టాభిరామయ్య కాలనీలోని ఒక ఇంటిపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో సీఐ అంకమ్మరావు సిబ్బందితో వెళ్లగా మహిళలు పురుషులు పేకాట ఆడుతున్నారు. పోలీసులను చూడగానే ముగ్గురు పురుషులు పారిపోగా, ఎనిమిది మంది మహిళలు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రూ.1.36 లక్షల నగదు, చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి వివరాలు తెలుసుకుని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిలో మహిళా జూదరులు పట్టుబడడం ఇది రెండోసారి.

* ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం నిర్మించ తలబెట్టిన హ్యపీనెస్ట్ ఇళ్ల నిర్మాణంపై రివర్స్ టెండర్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. హ్యాపీ నెస్ట్ ద్వారా ఫ్లాట్లను నిర్మించి విక్రయించాలని తద్వారా ఆదాయం సమకూర్చు కోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తలపెట్టింది. అమరావతి సమీపంలోని నేలపాడులో మొత్తం 1200 ఫ్లాట్స్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్మాణానికి ముందు ఫ్లాట్ల విక్రయాలు సైతం జరిగాయి. ఈ ప్రాజెక్టు సీఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇదిలా ఉంటే, తాజాగా జగన్ ప్రభుత్వం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును కొనసాగిస్తామని పేర్కొంది. అయితే తిరిగి దీని నిర్మాణంపై మాత్రం కొత్త టెండర్లు పిలవాలని జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలో తొలిసారి జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్ వెళ్లిన ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.

* హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ యత్నం కలకలం సృష్టించింది..  రియల్ ఎస్టేట్ వ్యాపారి యాదగిరి రెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాగానే కాలనీ శివారులో 2 కార్లలో ఉన్న కిడ్నాపర్లు ఆయనను బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించారు. దీంతో యాదగిరిరెడ్డి గట్టిగా కేకలు పెట్టడంతో ఆయన ఫోన్, కారు తీసుకుని దుండగులు పరారయ్యారు. హుటాహుటిన తన ఇంటికి చేరుకున్న బాధితుడు ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కిడ్నాపర్ లు  తమ వెనుక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారంటూ బెదిరించారంటూ తన ఫిర్యాదులో బాధితుడు పేర్కొ న్నాడు.