Kids

కోపం ఎక్కువ. దానికి తోడు ఏడుపులు.

How to handle sensitive crying and angry kids-telugu kids news

మా అమ్మాయికి పదేళ్లు. సున్నిత మనస్కురాలు. ఏదైనా గట్టిగా అంటే ఏడ్చేస్తుంది. కోపమూ ఎక్కువే. బయటివారితో సరిగా మాట్లాడదు. ఈ మధ్య తరచూ నిద్రలో కలవరిస్తోంది. ఈ సమస్యలకి పరిష్కారం సూచించగలరు?

మీ పాప సున్నిత మనస్కురాలని రాశారు. ఏ విషయాలకు భయపడుతుందో ముందు గమనించండి. నిద్రలోనూ కలవరిస్తోందంటే… పాప ఏదో విషయానికి ఆందోళన చెందుతుందని అర్థం. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల మధ్యే తాను సురక్షితంగా ఉన్నట్లు భావించి ఉండొచ్ఛు అందుకే… మీతో తప్ప ఇతరులతో మాట్లాడటంలేదు. మీరెవరూ ఆమెమీద దృష్టిపెట్టనప్పుడే చికాకు, కోపం లాంటి ఉద్వేగాలు వ్యక్తం చేస్తోందేమో గమనించారా! పాపను మార్చాలంటే… ముందు తోటి పిల్లలతో కలిసి ఆడుకునేలా చూడండి. అందరిలో కలవడం మొదలుపెట్టాక ఎప్పుడైతే భయపడకుండా, ఏడవకుండా ఉంటుందో ఆ సందర్భాన్ని గమనించండి. పాపతో ‘నువ్వు ఇప్పుడు భయపడకుండా ఆడుకుంటున్నావు తెలుసా…’ అంటూ మెచ్చుకోండి. ఏడ్చినప్పుడు ఆమె దృష్టి మళ్లించడానికి ప్రయత్నించండి తప్ప అతిగా స్పందించకండి. లేదంటే ‘నేను ఏడిస్తే అమ్మానాన్న నా మాట వింటారు. నేను అడిగింది చేస్తారు’ అనే భ్రమను పెంచుకోవచ్ఛు చిన్నచిన్న పనులు అప్పగించి వాటిని పూర్తిచేసేలా ప్రోత్సహించండి. తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయం పోయేందుకు సాహస కథలను చెప్పాలి. సమస్య ఎదురైతే మీరు అండగా ఉంటారనే ధైర్యాన్నివ్వాలి. ఇన్ని చేసినా పాప ప్రవర్తనలో మార్పు రాకపోతే ఓసారి మానసిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లడమే మంచిది. పరిస్థితిని బట్టి మీకూ, పాపకు కౌన్సెలింగ్‌ చేస్తారు.