అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో భారతీయ రుచులకు మధురమైన చిరునామాగా మారిన “బావర్చి బిర్యానీస్” అమెరికాలో సెలవుల సీజన్‌ను పురస్కరించుకుని టెక్సాస్ రాష్ట్రంలోని అర్వింగ్ నగరంలో గల తమ శాఖను నూతన చిరునామాకు మార్చి సరికొత్త హంగులతో భారీగా విస్తరించారు. 7750 N Mac Arthur Blvd, #195, Irving – TX – 75063 చిరునామాలో ఈ నూతన శాఖను ఏర్పాటు చేశారు. “భోజనానికి కావల్సినవి ఆహార పదార్థాలు ఒక్కటే కాదు. తినే వాతావరణం, శుభ్రమైన పరిసరాలు, చవులూరించే రుచులు ఇవన్నీ భోజన సమయాన్ని ఆస్వాదించడానికి తోడ్పడతాయి. అందుకే మా ఈ నూతన శాఖ విస్తరణ ద్వారా ఈ విభాగంలో కార్నర్ సీట్స్, మూడ్ లైటింగ్, మోడ్రన్ డిజైన్ల వంటి వాటిపై మేము ప్రత్యేక దృష్టి సారించి అతిథులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరించే రుచులను అందించడానికి సిద్ధంగా ఉన్నాము. గ్రబ్‌హబ్, డోర్‌డ్యాష్ వంటి సాంకేతికత ద్వారా ఆన్‌లైన్ ఆర్డరింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాము. మీరు ఆర్డర్ ఇచ్చిన స్వల్ప వ్యవధిలోనే మీకు తాజా భారతీయ రుచులు మీ ముంగిటకు చేరుస్తాము. ఈ సెలవుల సీజన్‌లో మీరంతా కుటుంబ సమేతంగా ఈ నూతన శాఖను సందర్శించి మా సరికొత్త రుచులను ఆస్వాదించి బావర్చి అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాము.” అని బావర్చి సంస్థల అధినేత కంచర్ల కిషోర్ తెలిపారు. అర్వింగ్ బావర్చి నూతన హంగులు, సెలవుల సీజన్‌లో ప్రత్యేక ఆఫర్లకు దిగువ బ్రోచర్లను చూడవచ్చు.
సరికొత్త హంగులతో విస్తరించిన అర్వింగ్ బావర్చి
Related tags :