మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నది కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత ఆమెను దృష్టిలో పెట్టుకొని భిన్న భాషల్లో వైవిధ్యమైన కథలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది కీర్తిసురేష్. స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ షూటర్ పాత్రలో నటిస్తున్నది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ క్రీడలో విజేతగా నిలిచే క్రమంలో ఓ యువతి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నది. వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా డీ గ్లామర్ లుక్‌తో కీర్తిసురేష్ కనిపించనుంది. మరోవైపు భారత మాజీ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీం జీవితంఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం మైదాన్‌లో అబ్దుల్ రహీం భార్య పాత్రలో కీర్తిసురేష్ నటిస్తున్నది. కార్తిక్‌సుబ్బరాజు నిర్మిస్తున్న తమిళ చిత్రం పెంగ్విన్‌లో గర్భవతి పాత్రను పోషిస్తున్నది.
షూటర్ సురేష్
Related tags :