అమెరికాలోని మిస్స్సిస్సిప్పీ రాష్ట్ర రిడ్జ్‌ల్యాండ్ నగర ప్రవాసులు ఆదివారం నాడు కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 200మంది ప్రవాసులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉసిరి, తులసీ మొక్కల ఆరాధనతో ప్రారంభించారు. మహిళలు, చిన్నారులకు పలు సరదా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు – పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిస్సిస్సిప్పీలో కార్తీక వనభోజనాలు
Related tags :