ఆతిథ్య సేవారంగ సంస్థ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ నికర నష్టాలు మరింత పెరిగాయి. 2019, మార్చి 31తో ముగిసిన ఆర్థిక ఏడాదికి రూ.2,384 కోట్ల నష్టాలను కంపెనీల రిజిస్ట్రార్‌కు వద్ద నమోదు చేసింది. గతేడాది నష్టాల విలువ రూ.360.43 కోట్లుగా ఉంది. 2018-19లో సంస్థ నిర్వహణ ఆదాయం రూ.6,456.90 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇవి రూ.1,413.02 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం వెల్లడించినవి ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాలని ఓయో తెలిపింది. షేర్ల ధరలను ఫెయిర్ మార్కెట్ విలువ ఆధారంగా లెక్కించారని పేర్కొంది. ఆడిట్ చేసిన ఫలితాలను తిరిగి కంపెనీల రిజిస్ట్రార్ వద్ద నమోదు చేస్తామని వెల్లడించింది. ఇక సంస్థ నిర్వహణ ఖర్చులు 2018 నాటి రూ.1246.84 కోట్ల నుంచి 2019, మార్చి 31తో ముగిసిన ఏడాదికి రూ.6,131.65 కోట్లకు పెరిగాయి. ఉద్యోగుల ప్రయోజనాల ఖర్చులు సైతం రూ.1,538.85 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం ఓయో సంస్థ విలువ 36,658.34 కోట్లుగా ఉందని సమాచారం.
ఆదాయం రూ.6456 కోట్లకు పెరిగింది
Related tags :