* మంగళగిరి యర్రబాలెం గాంధీ బోమ్మ సెంటర్ లో రాజధాని రైతుల నిరసన కార్యక్రమం మంత్రి బోత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యర్రబాలెం గాంధీ బోమ్మ సెంటర్ లో రాజధాని రైతుల నిరసన.
* ఈ రోజు ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ రెండో భాగం,విజయవాడ బైపాస్ రోడ్డు,రాజధానిని అనుసంధానించే రోడ్ల అభివృద్ధిని వెంటనే చేపట్టాలని కోరిన టీడీపి ఎంపిలు కేశినేని నాని,గల్లా జయదేవ్,రామ్మోహన్ నాయుడు,కనకమేడల రవీంద్రకుమార్,సీతామహాలక్ష్మి.
* జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 6 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. రైతులు, మేధావులను కలసి పలు అంశాలపై చర్చించనున్నారు. అపరిష్కృత సమస్యలు, మౌలిక సదుపాయాల లేమి కారణంగా బాధపడుతున్న ప్రజలతో మాట్లాడనున్నారు. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో… జనసేన అభ్యర్థులు, నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్రమ కేసులకు గురవుతున్న… జనసేన నాయకులు, శ్రేణులతో మాట్లాడి పవన్ భరోసా కల్పిస్తారని సమాచారం
* రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
* భారత దేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు నిండిన సందర్భంగా ఇవాళ పార్లమెంట్‌లో ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం అయ్యాయి. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. జ్ఞానానికి మహా కేంద్రంగా పార్లమెంట్ విలసిల్లుతోందన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది పార్లమెంట్‌లో చరిత్రాత్మక దినమన్నారు. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడిలో చనిపోయినవారికి ప్రధాని మోదీ తన ప్రసంగంలో నివాళి అర్పించారు. ఆ దాడిలో సుమారు 166 మంది మరణించారని ఆయన అన్నారు. మన రాజ్యాంగమే మనకు పవిత్ర గ్రంథమన్నారు. ఆ గ్రంథమే మన జీవితాలను, మన సమాజాన్ని, మన సాంప్రదాయాలను, నమ్మకాలను ప్రస్పుటిస్తుందన్నారు. కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను కూడా ఆ గ్రంథం పరిష్కరిస్తుందన్నారు.
* ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. ఇటీవల వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లిద్ సమావేశాల ముందు సీఎంతో వంశీ భేటీపై ఆసక్తి నెలకొంది. రాజీనామా, వైసీపీలో చేరిక అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది…
* దేశం గుర్తించిన రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడం.. మంత్రి బొత్స సత్యనారాయణ దిగజారుడు తనానికి నిదర్శనమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. జరుగుతున్న పనులను ఆపి.. రాజధానిని నిర్వీర్యం చేసి ఇప్పుడిలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని సోమిరెడ్డి పేర్కొన్నారు.
* తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి.. బిజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కామెంట్స్.ఏపీ అభివృద్ధి చెందాలంటే బిజేపి అధికారంలోకి రావాలి.. పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఎవర్నైనా పార్టీలో చేర్చుకుంటాం. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, పోర్టులు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, తీరప్రాంతాల అభివృద్ధికి 5లక్షల కోట్లు కేంద్రం మంజారు చేయనుంది.అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నిర్మాణం చేస్తాం.. ఏపీ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేసిన కమిటీ నిఫుణులు ఎవర్నీ కలవకుండానే నివేదికలు ఇచ్చేస్తుంది.. విశాఖకు ఇసుక సరఫరా లో చాలా రేటు పెంచేశారు.. ప్రభుత్వం లోని ఒకాయన విశాఖలో మకాం వేసి అభివృద్ధి చేస్తానంటాడు. ఏపీలో మినరల్స్ పై600 కోట్లు ఆదాయం వస్తుందట.. కానీ అదే ఇసుక వేలం వేస్తే 5వేల కోట్లు ఆదాయం వస్తుంది. అయితే చౌకగా ఇసుక అమ్మాలి.
* ఇన్నాళ్ళూ బొత్సాగారి మెదడు అరికాల్లో ఉంది అనుకున్నా… అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న జగన్ అక్కడే ఆగిపోతారని ఊహించలేదు. అందుకే అమరావతిని, శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు బొత్సాగారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం వైకాపా నాయకులకు అర్థం అవుతుంది అనుకోవడం అత్యాశే అవుతుంది ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారు. ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.