వైఎస్సార్ రైతు భరోసా పధకంలో ప్రభుత్వం పలు సవరణలు చేసింది.
మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎంఎల్సీలు, మాజీలను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించింది.
రైతు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు, టాక్స్ కట్టేవారు ఉన్నా.. పథకానికి రైతు అర్హుడని, అర్హులైన రైతు మరణిస్తే చట్ట ప్రకారం కుటుంబంలోని అర్హులకు ఈ పధకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.