సాధారణంగా ప్రతి ఇంట్లో అన్నం వండేటప్పుడు వచ్చే గంజి నీటిని పారబోస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. గంజి నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఈ నీటిలో మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు అధిక మోతాదులో ఉన్నాయని వారు చెప్తున్నారు. అందువల్ల గంజినీటిని పారబోయకుండా వాటిని గోరువెచ్చగా ఉండగానే అందులో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచిది. గంజి నీటిలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన పోషణని పుష్కలంగా అందిస్తాయి. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపాలు రాకుండా కాపాడుతాయి. ఈ గంజి నీటిని తరచు చిన్నారులకు తాగిస్తుంటే.. వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఇక పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటిని అయినా తాగించాలి. అప్పుడే వారికి కావల్సిన ఆహారం అంది శక్తి లభిస్తుంది. తరచు చాలామంది చర్మం సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే.. చర్మ దురదలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. దురద ఉన్న ప్రాంతంలో కొద్దిగా గంజినీటిని పోసి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై దురదలు తగ్గిపోతాయి.విరేచనాల సమస్యతో బాధపడేవారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.
2.కలబందతో ప్రకాశవంతంగా…
కలబంద ఆకులకు నీటిని పీల్చుకునే గుణం ఉన్నందున తరచూ వాడితే ముఖ చర్మంలో తగినంత తేమ నిలిచి పొడిబారకుండా ఉంటుంది. చర్మం ప్రకాశవంతంగానూ మారుతుంది.కాలిన చర్మపు గాయాలు, పడిన మచ్చలు మీద కలబంద గుజ్జును రాస్తుంటే కొంత కాలానికి అవన్నీ మటుమాయమౌతాయి. కలబంద గుజ్జును కొబ్బరినూనెతో కలిపి మోచేతులు, పాదాల వద్ద నల్లగా మారిన చర్మంపై రాస్తే, నలుపు తగ్గి చర్మం కలిసిపోతుంది. పరగడుపున అరచెంచా కలబంద గుజ్జు సేవిస్తే ఉదర సంబంధ సమస్యల బెడద లేనట్లే. రోజ్‌వాటర్‌లో కలబంద గుజ్జు కలిపి చర్మంపై రాస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది.కలబంద గుజ్జును ముల్తానీమట్టి లేక గంధపు పొడితో కలిపి మొటిమలకు రాస్తే మొటిమలు మాయమవుతాయి. కలబందతో చేసిన సబ్బులు, క్రీములను వాడటం వల్ల ముఖం మీది ముడతలు తగ్గటమే గాక సన్‌స్క్రీన్‌గానూ పనిచేస్తుంది. అలాగే చర్మ సమస్యల బెడదా ఉండదు.
3. ఏసీ గదుల్లో ఉంటే అంతే సంగతి!
-ఏసీ ఆన్ చేయగానే తలుపులు మూసేస్తాం. అందువల్ల మనం విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను మళ్లీ మనమే పీలుస్తుంటాం. దీంతో ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. రోజూ ఆరు గంటలకంటే ఎక్కువ ఇలా ఏసీ గదుల్లో గడిపితే మైగ్రేన్‌గా మారే అవకాశం ఉంది. – ఏసీ వల్ల లోబీపీ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి శరీరం త్వరగా అలసిపోతుంది. ఏసీలో ఎంత కూలింగ్ పెరిగితే శరీరానికి అంత ప్రమాదం. చల్లదనం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. -ఏసీలో ఎక్కువగా ఉండేవారు అధికంగా నీళ్లు తాగకపోతే వాళ్లకు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఏసీవల్ల చర్మం పొడిబారుతుంది. ముక్కు దిబ్బడ, గొంతు గరగర, వైరల్ అలర్జీస్ వంటివి వ్యాపిస్తాయి. వీలైనంత వరకు ఏసీ వాడకుండా ఉండడమే మంచిది. ప్రత్యామ్నాయంగా ఫ్యాన్ వాడొచ్చు. -ఏసీ వల్ల అస్తమా లాంటి దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు. నీరసం, నిస్సత్తువ, డిప్రెషన్ వంటి సమస్యలు కృత్రిమ చల్లదనం ఇచ్చే ఏసీల వల్లే వ్యాపిస్తాయి. ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే మనం ఏసీని తక్కువగా వినియోగిస్తేనే మంచిది. -తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ వాడాల్సి వచ్చినప్పటికీ వీలుచిక్కినప్పుడల్లా బయటి వాతావరణంలో గడపాలి. తలుపులు, కిటికీలు తెరచి సహజసిద్ధమైన గాలిని లోపలికి రానిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోంచి చెమట బయటకొస్తేనే మంచిది. ఏసీ వాడడం వల్ల శరీరంలోంచి చుక్క చెమట కూడా బయటకు రాదు.
4.అంజీర వల్ల ప్రయోజనాలు
కొంచెం వగరు కొంచెం తీపి కొంచెం పులుపు ఉండే అమ్జీర్ డ్రై ఫ్రూట్ ఏడాది పొడుగునా మార్కెట్ లో లభ్యమవుర్తుంది వీటిల్లో ఉండే పిండి చక్కర పదార్స్ధాలు ఎక్కువ సి,ఎ, బీ విటమిన్లు పొటాషియం కాల్షియంఇతర ఖనిజ లవణాలు కూడా తగు మోతాదులో ఉన్నాయి. జీర్నక్రీయకు వేగవంతం చేయడంలో అమ్జీర్ బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి ఎముకల బలంగా ఉండేలా చేస్తాయి. గుండెజబ్బులు క్యాన్సర్ లు మంచి ఔషదం కాల్షియం పీచు రూపంలో ఉండేది అమ్జీర్ లో మాత్రమే రోగనిరోధక శక్తిని పెంచే డ్రై ఫ్రూట్ ఇది. శరీరంలో అవసరమైన సహ్క్తిని వేగంగా అందిస్తాయి. ఎ వ్యాధితో బాధపడుతునంరో అన్జీర్ ను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. జ్వరం వచ్చి తగ్గినా వెంటనే రెండు అన్జీర్లను తింటే నోటికి రుచి, ఒంటికి శక్తి వస్తాయి.
5.అరటిపండు ఈ సమస్యలకు ఉన్న్నవారు తినక్నదిఉ
అరటిపండు వాళ్ళ మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికి తెలిసిందే. ఆపండ్లలో యాంటీ అక్సినేట్లు విటమిన్ బీ 6 విటమిన్ సి మెగ్నీషియం కాపర్ మంగానీస్ ఫైబర్ పొటాషియం ఉంటాయి. దీంతో మానసిక ప్రసంతత కలుగుతుంది. అరటి పంల్డతో ఉండే పోషకాలు నిద్రలేమి సమస్యను పోగొడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అందరూ దీన్ని తినకూడదు కేవలం కొంతమంది మాత్రమే తినాలి మరి అరటి పండును ఎ సమయాలు ఉన్నవారు తినకూదదో ఇప్పుడు తెల్సుకుందాం. మధుమేహం ఉన్నవారు అరటి పండ్లతో తింటే మర అరటిపండును రక్తంలో చక్కర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. మళ్ళీ ఆ స్థాయిలు తగ్గాలంటే అందుకు లివర్ మూత్రపిండాల పై అధిక శాతం భారం పడుతుంది. కనుక మధుమేహ వ్యాదిగ్రతులు అరటిపండలకు దూరంగా ఉండడం మంచిది అధిక బలువు ఉన్నవారు కర్భోహైదేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు.
గంజిని పారేయద్దు.ఇలా వాడుకోండి.
Related tags :