*19 సంవత్సరాల ఇండో-అమెరికన్ విద్యార్ధినిని దుండగుడు లైంగికంగా వేధించి హత్య చేసిన ఘటన అమెరికాలోని తెలుగు రాష్ట్రాల వారిని కలవరపాటుకు గురిచేసింది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హానర్స్ స్టూడెంట్ అయిన హైదరాబాద్‌కు చెందిన యువతి శనివారం క్యాంపస్ గ్యారేజ్‌లోని కారు వెనక సీటులో విగతజీవిగా కనిపించారు. బాధిత విద్యార్థిని కుటుంబం అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగుడు డొనాల్డ్ తుర్మన్ (26)ను చికాగో మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడికి యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేదని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడిపై హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
*రద్దీగా ఉండే సిటీ రోడ్లమీద లారీలు, టిప్పర్లు నడిపినట్టు ఆర్టీసీ బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే యాక్సిడెంట్లు పెరుగుతున్నయ్. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా గ్రేటర్ ఆర్టీసీ ఎవరిని పడితే వాళ్లను రిక్రూట్ చేసుకుంది. 52 రోజుల సమ్మె కాలంలో అనుభవం లేని డ్రైవర్లతో ప్రమాదాలు పెరగడంతో హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తాత్కాలిక డ్రైవర్ల కారణంగానే ప్రమాదాలు పెరిగాయని.. ఇది ప్రజల ప్రాణాలకు ప్రమాదమేనని తెలిపింది.
*వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాద సంఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలోని అశోక్‌నగర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
*ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ప్రైవేటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది.
* విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం వద్ద రిలయన్స్ ఫ్రెష్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు ఒక్కసారిగా అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో, బైక్‌లను ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో జీపు అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. గాయపడిన వారిని అగనంపూడి ఆసుపత్రికి తరలించారు.
* హీరో సంపూర్ణేష్ బాబు కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సంపూర్ణేష్ బాబు కుటుంబంతో ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్, ఆయన భార్య, కూతురికి గాయాలయ్యాయి. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
* అనంతపురంజిల్లా కేంద్రంలోని రైతు బజార్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం గంటలకు అధికారులు రైతు బజార్ గేట్లను మూసివేశారు. దీంతో వినియోగదారులు ఒక్కసారిగా గేట్లను తోసివేసి లోపలికి వచ్చారు. ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడంపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. వృద్ధులుమహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
* శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. జెడ్డా నుండి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరంలో బంగారం అమర్చి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్‌లోని అశోక్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్ నగర్‌లో నివాసముంటున్న స్వర్ణకారులు గట్టు ముక్కుల సతీష్ (అతని భార్య తనూజ(లు నేటి ఉదయం సైనైడ్ మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
* హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వసంత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప సొసైటీకి చెందిన సయ్యద్ కాసిం(25) హోండా యాక్టివాపై వెళుతుండగా వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది.
* మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని దాబా గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
* భారత నౌకాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్ కుమార్ ఇవాళ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ హాస్పటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు.
*పాఠశాల ఉపాధ్యాయురాలు చేయి చేసుకోవడం తో మనస్తాపం చెంది నాలుగు రోజుల క్రితం విషగుళికలు తీసుకోవడం తో కుటుంబ సభ్యులు గుంటూరు తరలించారు చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*తమిళనాడు మార్కెట్‌లల్లో ఉల్లి దిగుమతి బాగా తగ్గడంతో ధర రూ.130కి చేరింది. దీంతో మహిళలు ఉల్లి వాడేందుకే భయపడుతున్నారు. ఆంధ్రా, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి స్థానిక కోయంబేడు మార్కెట్‌కు దిగుమతి అవుతోంది.
*చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని వేడంలో కొలువైన కాలభైరవ ఆలయంలో కొంతమంది తమిళులు క్షుద్రపూజలను నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానిస్తున్నారు.
*తన సోదరుడి ద్వారా లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న గూడూరు తహసీల్దార్ ఆచూకీ నేటికీ లభించలేదు. ఇంతకీ ఆమె ఎక్కడ? ఇన్ని రోజులుగా తప్పించుకుని ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనేది ఆసక్తికర చర్చగా మారింది. రెవెన్యూ ఉన్నతాధికారుల చరవాణులకు సైతం ఆమె అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తప్పించుకుని తిరుగుతున్న తహసీల్దార్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
*ఆర్టీసీ వ్యవహారం గురించి వివరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బుధవారం ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నాయి. వాస్తవానికి మంగళవారమే కలవాలని భావించి నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు అపాయింట్‌మెంట్ కోరారు. ప్రధానికి ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో బుధవారం కలిసే ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఎంపీలకు తెలిపారు.
* మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం… మీ ఏటీఎం కార్డును రెన్యువల్ చేయాలి… కార్డు నంబరు చెప్పండంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయడంతో నిజమేనని నమ్మిన కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామానికి చెందిన పోట్లూరి సురేష్ అనే వ్యక్తి మోసపోయారు. బాధితుడు చెప్పిన వివరాల మేరకు… మంగళవారం తనకు బ్యాంకు ఉద్యోగి పేరిట ఫోన్‌రాగా ఏటీఎం వివరాలు తెలియజేశానని, తన వివరాలు ఇచ్చిన కొద్దిసేపట్లోనే తన బ్యాంకు ఖాతా నుంచి అయిదు విడతలుగా రూ.99,495 నగదు డ్రా చేశారు. వెంటనే తన బ్యాంకు ఖాతా ఉన్న నెల్లూరు వెంకటేశ్వరపురంలోని బ్యాంకు వెళ్లి విచారించగా ఆన్‌లైన్లో పేటీఎం ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు నగదు డ్రా చేశారని బ్యాంకు అధికారులు చెప్పారు. మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
*పండ్ల వ్యాపారిని వెంటాడి చంపిన సంఘటన మంగళవారం రాత్రి 7.45గంటలకు డబీర్‌పురా ఠాణా పరిధిలో జరిగింది
*బెంగళూరు రహదారిలోని ఓ నర్సింగ్ హోం సమీపంలో మంగళవారం రోడ్డుపై ఉన్న ఓ నవజాత శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
*డ్రంకన్ డ్రైవ్‌లో సినీ నటుడు ప్రిన్స్ కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం రాత్రి బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వైపు ఇంటికి కారులో వెళుతున్న ప్రిన్స్‌కు పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించారు.
*కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డ వద్ద ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వస్తున్న అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ పులిగడ్డ సమీపంలో రాగానే ఆటోను ఢీకొంది.
*ప్రమాదవశాత్తూ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం… పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లె వద్దకు రాగానే ఆయిల్ ట్యాంకర్ లీకైంది.
*కడప జిల్లా చిన్నమండెం మండలంలో ట్రాక్టర్ బోల్తా పడింది. మండలంలోని బోనమల్ల-సి.పులమెరపల్లి గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బోనమల్లకు చెందిన తల్లీ కుమారుడు మృతిచెందగా.. ఆమె భర్తతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
*ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు అపహరణకు గురైంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన ఎస్.రమాదేవికి ఈనెల 9న అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో కాన్పులో ఆడబిడ్డ జన్మించింది.
*పూజాది కైంకర్యాలు నిర్వహించే అర్చకుడు దేవుడి సన్నిధిలోనే భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.
*మరో ఆర్టీసీ డ్రైవర్ గుండె ఆగింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్‌పాడ్ గ్రామానికి చెందిన రాజేందర్(52) అనే ఆర్టీసీ డ్రైవరు మంగళవారం గుండెపోటుతో మరణించారు.
* గుంటూరులోని వైకుంఠపురం ఆలయంలో పూజారి నిర్వాకం ప్రతి ఒక్కరిని నివ్వెరపరుస్తోంది. పిల్లలు కలగాలంటే పూజలు చేయాలని ఓ మహిళను పూజారి నమ్మించాడు. దీంతో సదరు మహిళ పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లగా.. పూజారి ఆమెను గర్భాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారం యత్నం దీంతో ఆ మహిళ పూజారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
* చ్చిబౌలి దారుణం జరిగింది. నాగేశ్వరి అనే 16 సంవత్సరాల బాలిక ముళ్ల పొదల్లో శవమై కనిపించింది. ఈ ఘటన మసీద్‌బండలో జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. నాగేశ్వరి నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. నాగేశ్వరి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. నాగేశ్వరి శరీరంపై గాయాలుండటం చూస్తే.. ఇది హత్య అనే అనుమానాలు కలుగుతున్నాయి.
హైదరాబాద్ విద్యార్థినిపై అమెరికాలో అత్యాచారం-నేరవార్తలు-11/27
Related tags :