*మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంధ్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన తర్వాత ఆయన భార్య అమృతా ఫడ్నవీస్ కవితాత్మకమైన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్త పరిచారు.తిరిగి వస్తాం మరిన్ని సువాసనలను వెదజల్లడానికి.. ఇది శరధ్రుతువని వాతావరణం మారేవరకు వేచిచూస్తామని అన్నారుఅమృతా ఫడ్నవీస్. మహారాష్ట్ర ప్రజలు ఐదేళ్లుగా తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మీ వదిన (అమృతా ఫడ్నవీస్) ఎప్పటికీ మహారాష్ట్ర ప్రజల ప్రేమను గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. సాధ్యమైనంతవరకు సమర్ధవంతంగా పనిచేయడానికి ప్రయత్నించానని తెలిపారు.
*వైఎస్ భారతి ఆస్తుల జప్తు
వైకాపా అధినేత జగన్ ఆస్తుల కేసులోని భారతీ సిమెంట్స్ లో ఈడీ జప్తు చేసిన ఆస్తులపై యధాస్స్తితిని కొనసాగించాలని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తవ్యులు పై యధాస్థితిని కొనసాగించాలని ఎతీవా హైకోర్టు మధ్యంతర ఉత్తవ్య్యులు జారీ చేసింది. భారతీ సిమెంట్స్ కేసులో 2016 జూన్ లో రూ.746కోట్ల స్థిర, చరాస్తులు గతంలో ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.
*మహా సంకీర్ణానికి చిదంబరం సలహా
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో దాదాపు వందరోజుల నుంచి తీహార్ జైలులో గడుపుతున్న కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి చిదంబరం మహారాష్ట్రలో కొలువుదీరనున్న సంకీర్ణ సర్కార్కు కీలక సూచన చేస్సారు, శివసేన- ఎనేస్పీ కాంగ్రెస్ పార్టీలతో కూడిన సంకీర్ణ సర్కార్ ప్రజా ఆకాంక్షలకు అడ్డం పట్టాలని కోరారు. పార్టీల వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి రైతు సంక్షెమమ్ పెతుబడులు ప్రయోజనాల పై మూడు పార్టీలు కలిసి పనిచేయాలని ఆకాంక్షి చారు.
*సీఎం అవుతానని అనుకోలేదు..ఉద్థవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయ మలుపులు ముగిశాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమితో కూడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. మంగళవారం నాడు సుప్రీంకోర్టు తీర్పుతోపాటు పలు కీలక పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. ముందు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంతోపాటు బిజెపికి అసలు విషయం అర్ధమైపోయింది. వెంటనే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన అధినేత ఉద్థవ్ ఠాక్రే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి తరుఫున నేతగా మూడు పార్టీల సభ్యులు (ఎమ్మెల్యేలు) శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. నవంబర్ 28న ముంబైలోని శివాజీ పార్క్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం స్వీకారం చేస్తారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ కూడా ప్రమాణం చేయనున్నారు.
*సుప్రీయా తండ్రికి తగ్గ కూతురు
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఊహించని మలుపులతో నెల రోజులుగా ‘మహా’ పొలిటికల్ ఎపిసోడ్ థిల్లర్ సినిమాను తలపించింది. అపర చాణక్యుడు శరద్ పవార్ సెంటిమెంట్‌తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మహా వికాస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరబోతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శరద్ పవార్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ‘మహా’ పర్వంలో పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించి తండ్రి తనయ అనిపించుకున్నారు.
*చంద్రబాబు ఎదుటే తమ్ముళ్ళు కొట్టుకున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు కడప జిల్లాలో నిర్వహించిన పార్టీ సమీక్షలో కార్యకర్తలు కొట్టుకున్నారు. కడప నియోజక వర్గ టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలను చంద్రబాబుకు చెప్పుకున్నారు. అయితే వారిని అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పై ఉన్న అసంతృప్తిని చంద్రబాబుకు చెప్పారు. దీంతో వారిపై అక్కడే ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దాడిచేశారు. చంద్రబాబు వారించినా లాభంలేకుండా పోయింది. దళితులు అయినందుకే తమను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని ఇప్పుడు చంద్రబాబు ముందే దాడిచేశారని చెప్పారు.
*కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఏ పి ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీస్పీకర్ తమ్మినేని సేతారంపై విజయవాడ పోలీస్ కమీషనర్ తిరుమలరావుకు ఫిర్యాదు చేసిన సుంకర పద్మశ్రీసుంకర పద్మశ్రీ కామెంట్స్…..వైసీపీ మంత్రులు, స్పీకర్ బాషా వ్యవహార శైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు
స్పీకర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపి ని కోరాముతమ్మినేని స్పీకరా….బ్రోకరా..అని ప్రశ్నిస్తున్నాజగన్ వెంటనే స్పీకర్ ను బర్తరఫ్ చేయాలివైసిపి ప్రభుత్వంలో మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయింది
*కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీని జాతీయం చేస్తాం: భట్టి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని జాతీయం చేస్తామని ఆ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే.. తాము అధికారంలోకి రాగానే వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
* సమ్మెను అణచాలని ముందే అనుకున్నరు: జగ్గారెడ్డి ‘
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన కాసేపటికే సంస్థ ఎండీ ప్రకటన చేశారు. కార్మికులను అణగదొక్కే ప్రణాళిక సర్కారు దగ్గర ముందే ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది. అయినా ఐఏఎస్‌లే మంత్రులా? ప్రకటన మంత్రి చేస్తారా? అధికారులా?’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం ప్రశ్నించారు. ‘ఏ డిపోలో చూసినా పోలీసులే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పోలీసులే బతకాలా.. ప్రజలు బతకొద్దా’ అని నిలదీశారు. ఆకలవుతోందని చెప్పే హక్కు కూడా రాష్ట్రంలో లేదా అని అడిగారు. రాష్ట్ర ఉద్యమం టైంలో స్పీచులిచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టిన మల్లెపల్లి లక్ష్మయ్య, గంటా చక్రపాణి, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, స్వామి గౌడ్ ఇప్పుడు ఏమయ్యారన్నారు. ‘ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్, మమత కేసీఆర్ ఇంటి దగ్గరే కనబడుతున్నరు. ఉద్యమ నాయకులకు సిగ్గనిపిస్తలేదా? మీ ఓంట్లో ఉన్నది రక్తమేనా’ అని మండిపడ్డారు. కార్మికులను తొలగిస్తే తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.
* రాజధాని శ్మశానం అయితే కాటి కాపరి ఎవరు?: కూన రవికుమార్
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మతితప్పి పిచ్చోడిలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆందోళన బొత్స ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజధాని అమరావతి శ్మశానం అయితే కాటి కాపరి ఎవరో చెప్పాలన్నారు. బొత్స బరువు కాదు..అహంకారం తగ్గించుకోవాలన్నారు. జగన్ అవినీతిని హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా పెట్టిందని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు.
* అందరూ బూతుశాస్త్ర కోవిదులే: వర్ల రామయ్య
తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య వైసీపీ మంత్రులపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ సహచర మంత్రులు.. అసెంబ్లీలో సమన్యాయం పాటించాల్సిన పెద్దమనిషి (స్పీకర్ తమ్మినేని) సహా ..అందరూ బూతుశాస్త్ర కోవిదులేనని అన్నారు. మంత్రుల బూతులపై మహిళలు ఆగ్రహంగా ఉన్నారని, ఏ చర్యలు తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారని వర్ల రామయ్య ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
* రాజధాని శ్మశానం అయితే కాటి కాపరి ఎవరు?: కూన రవికుమార్
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మతితప్పి పిచ్చోడిలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆందోళన బొత్స ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజధాని అమరావతి శ్మశానం అయితే కాటి కాపరి ఎవరో చెప్పాలన్నారు. బొత్స బరువు కాదు..అహంకారం తగ్గించుకోవాలన్నారు. జగన్ అవినీతిని హార్వర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీగా పెట్టిందని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు
*జాతీయ గణాంకాలశాఖ జవాబుదారీగా లేదు: ఎంపీ శశిథరూర్
జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్‌వో) పార్లమెంట్‌కు ఎందుకు జవాబుదారీగా లేదని ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న జాతీయ గణాంకాల లెక్కలు ప్రపంచదేశాలకు తప్పుడు సంకేతాలు అందిస్తున్నాయన్నారు. జాతీయ గణాంకాల తయారీ కోసం వినియోగిస్తున్న పద్ధతులను నిపుణులు సమీక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచవ్యాప్తంగా మన స్టాటిస్‌టికల్ డేటాకు విశ్వసనీయత తగ్గుతోందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంఖ్యలను మార్చడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. జీడీపీ రేటును 6.7 శాతం నుంచి 8.2 శాతానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు. డేటా సమీకరణ గురించి ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలన్నారు. విశ్వసనీయమైన గణాంకాలను వెల్లడిస్తేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గణాంకాల సమీకరణ కోసం విపక్షాలు ఎటువంటి సమాచారం ఇచ్చినా దాన్ని వాడుకుంటామని మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.
*మహారాష్ట్రలో మళ్లీ గుబాళిస్తాం : అమృత ఫడ్నవీస్
మహారాష్ట్రలో మళ్లీ గుబాళిస్తామని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కవిత్వం రూపంలో ఓ ట్వీట్ చేశారు. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన కొద్దిసేపటికి ఆమె ఈ ట్వీట్ చేశారు. ప్రస్తుతం శరద్ రుతువు కొనసాగుతుంది. వాతావరణంలో మార్పు కోసం వేచి చూడండి. త్వరలోనే తిరిగి వచ్చి కొమ్మలపై సువాసనలు వెదజల్లుతామని అమృత హిందీలో ట్వీట్ చేసి మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికారు. గత ఐదేళ్లుగా మహారాష్ట్ర ప్రజలు ఒక వదినలా తనపై ఎంతో ప్రేమను చూపారని, దాన్ని మరువలేనని అన్నారు. తన శక్తికొద్దీ, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశానని అమృత తన ట్వీట్ లో పేర్కొన్నారు.
*పౌల్ట్రీ రంగానికి మంచి భవిష్యత్ : మంత్రి తలసాని
మాదాపూర్ హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రసంగించారు. దేశంలో పౌల్ట్రీ రంగానికి మంచి భవిష్యత్ ఉందని మంత్రి తలసాని పేర్కొన్నారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దాణాను సమయానికి విడుదల చేశామన్నారు. పౌల్ట్రీ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఉత్తమ పాలసీ కోసం కృషి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ పౌల్ట్రీ విధానం తీసుకువస్తాం. తెలంగాణలో పౌల్ట్రీ రంగం ఉపాధి కల్పిస్తోంది. కోళ్ల రైతులకు సమస్య లేకుండా చూస్తాం అని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
*సీఎం జగన్ అవినీతిపై కాల్‌సెంటర్‌లో వర్ల ఫిర్యాదు
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తనపై తానే విచారణకు ఆదేశించుకోవాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన అవినీతిపై ఫిర్యాదుల కాల్‌సెంటర్ (14400)కు మీడియా ముందే ఫోన్ చేశారు. సీఎంపై ఫిర్యాదు చేయాలని కోరినప్పుడు వరుసగా మూడుసార్లు ఫోన్ ఆగిపోయింది. నాలుగో ప్రయత్నంలో కాల్‌సెంటర్ ప్రతినిధితో మాట్లాడారు. క్విడ్‌ప్రోకో ద్వారా రూ.వేల కోట్లు ఆర్జించారని, చంచల్‌గూడ జైలుకు వెళ్లారని, ఈడీ 5 ఛార్జిషీట్లు దాఖలు చేసిందని సీఎం జగన్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదైందని, సమాచారం తెలియజేస్తామని..సచివాలయంలోనూ ఫిర్యాదు చేయాలని కాల్‌సెంటర్ ప్రతినిధి సూచించారు
*6న తెదేపా కార్యాలయం ప్రారంభోత్సవం
తెదేపా జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవం డిసెంబరు 6న ఉదయం 10.03 గంటలకు జరగనుంది. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయి. తెదేపా జాతీయ కార్యాలయాన్ని మొత్తం మూడు బ్లాక్‌లుగా నిర్మిస్తున్నారు. వాటిలో ఒక బ్లాక్‌ను మొదట సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దానికి తుది మెరుగులు దిద్దుతున్నారు.
*తుప్పలు, ముళ్లపొదలు చూసేందుకేనా: నాని
‘రాజధానిలో నాలుగు భవనాలు, తుప్పలు, ముళ్లపొదలు తప్ప ఏమున్నాయి. అక్కడ పందులు, కుక్కలు తిరుగుతున్నాయి. వాటిని చూసేందుకే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారా?’ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో కొన్ని ఛానెళ్లతో మంత్రి కొడాలి నాని మాట్లాడారు.
*శ్మశానం నుంచే పాలిస్తున్నారా?: యనమల
‘‘ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స ఎక్కడ కూర్చుంటున్నారు? శ్మశానం నుంచే పాలిస్తున్నారా?’’ అని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బొత్సను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయకపోతే.. ఆయన చేసిన శ్మశానం వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి ప్రోద్బలం ఉన్నట్టేనని పేర్కొన్నారు. ‘‘ప్రజా దేవాలయం శాసనసభను, న్యాయ దేవాలయం హైకోర్టును శ్మశానంతో పోలుస్తారా? సచివాలయం వాళ్ల కళ్లకు శ్మశానంలా కనిపిస్తోందా?’’ అని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
*దేవాలయ భూములు విక్రయిస్తే ఊరుకోం: కన్నా
ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇచ్చిన వాటిని సొంత భూముల మాదిరిగా ప్రభుత్వం అమ్మాలని చూస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. విజయవాడలో మంగళవారం జరిగిన రాజ్యాంగదినోత్సవం సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ సొంత పథకాలుగా రాష్ట్రాలు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు.
*ఏం చేశారో చెప్పి అమరావతి వెళ్ళాలి: బొత్స
గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబు అమరావతికి వెళ్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అక్కడి రైతులకు ఎలా అన్యాయం చేశారో, నాలుగు భవంతులు తప్ప ఇంకేం కట్టారో, రాజధాని నిర్మాణానికి సేకరించిన నిధుల ఖర్చు వివరాలేంటో.. ఇవన్నీ వెల్లడించాకే చూసేందుకు వెళ్లాలన్నారు. మంగళవారం విజయనగరంలో మరో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
*ఎంపీలెవరూ వైకాపాను వీడరు: ఎంపీ బాలశౌరి
వైకాపా నుంచి భాజపాకు వెళ్లే ఎంపీలు ఎవరూ లేరని, ఇదంతా మీడియా సృష్టేనని ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు. మంగళగిరి శ్రీపానకాల శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాల సందర్శనకు వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ‘భాజపా కార్యాలయంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు’ అని పత్రికల్లో వచ్చిన అంశంపై ప్రస్తావిస్తూ వైకాపా ఎంపీలంతా తెలివైన, పరిణతి చెందిన వారని, ఎవరూ పార్టీని వదిలి వెళ్లరని స్పష్టం చేశారు.
*రూ.5లక్షల కోట్ల కేంద్ర ప్రాజెక్టులు: వీర్రాజు
రాష్ట్రంలో రూ.5లక్షల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్రం చేపట్టనుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి నినాదంగా రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలనేది తమ ఆశయమన్నారు. అందుకు పార్టీలో ఎవరు చేరినా ఆహ్వానిస్తామన్నారు.
*ఇది అందరి విజయం: తులసిరెడ్డి
రాజధానిలో నిర్మాణాలు ఆపకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటం హర్షణీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇది భూములిచ్చిన రైతులు, ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, మీడియా విజయమని ఒక ప్రకటనలో ప్రశంసించారు. రాజధాని, హైకోర్టు రెండు కళ్లు లాంటివని ఒకటి కోస్తాలో, రెండోది రాయలసీమలో ఏర్పాటు చేయాలని నాటి శ్రీబాగ్ ఒప్పందం చెబుతోందని పేర్కొన్నారు.
*రాజధాని గృహ సముదాయాలు కనపడటం లేదా?: దేవినేని
అమరావతిని మంత్రి బొత్స సత్యనారాయణ శ్మశానం అనడం దారుణమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన గృహ సముదాయాలు జగన్‌మోహన్‌రెడ్డికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టు, సచివాలయం పనిచేస్తుంటే మంత్రి మాత్రం శ్మశానం అంటున్నారన్నారు.
*కొందరికి పారదర్శకత రుచించడంలేదు: మోదీ
పారదర్శకత కోసం చేపట్టిన చర్యలేవీ కొందరికి రుచించడంలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల బాండ్లు అనేవి ఆ పార్టీలకు ‘ఇష్టమైన ప్రచార అంశం’గా అభివర్ణించారు. మంగళవారం ఆయన ఇక్కడ ‘రిపబ్లిక్ టీవీ’ సదస్సులో పాల్గొన్నారు.ఎన్నికల బాండ్ల అంశంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బాండ్లపై రిజర్వు బ్యాంకు, ఎన్నికల కమిషన్ వ్యక్తంచేసిన అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చిందంటూ వార్తలు రావడంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సున్నితమైన, భావోద్వేగాలతో ముడిపడిన అయోధ్య అంశం ఎప్పుడో పరిష్కారమై ఉండాల్సిందని, అయితే ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలోపెట్టుకొని కొన్ని పార్టీలు దాన్ని సాగదీశాయని మోదీ విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరిగే ముందు ప్రతిసారీ కొన్ని అంశాలను లేవనెత్తుతుంటాయని విపక్షాలను దుయ్యబట్టారు.
* కేబినెట్ భేటీ రెండ్రోజులు..ఆర్టీసీపై చర్చ
రాష్ర్ట కేబినెట్ గురు, శుక్రవారాల్లో భేటీ కానుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. మంగళవారం ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీ సమస్యను ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు కొనసాగే కేబినెట్ మీటింగ్లో చర్చిస్తారని తెలిపింది. గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు తిరిగి శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రివరకు భేటీ జరగనుంది.
త్వరలో మా ఆయన సిఎం అవుతారు-రాజకీయ-11/27
Related tags :