అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే సెలవులను పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 500కిలోల ఆహారాన్ని సేకరించి ఫీడింగ్ అమెరికా సంస్థకు విరాళంగా అందజేసింది. జీవితం పట్ల, మన సహచరుల పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలనే సదుద్దేశంతో నిర్వహించే థ్యాంక్స్ గివింగ్ వంటి పర్వదినాన ఈ భారీ విరాళాన్ని విజయవంతా పూర్తి చేయడం ఆనందం ఉందని నాట్స్ బోర్డు ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. టాంపా బే విభాగానికి నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు అభినందనలు తెలిపారు.
500కిలోల ఆహారాన్ని విరాళమిచ్చిన నాట్స్ టాంపా బే విభాగం
Related tags :