యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ అని, అతనితో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తెలిపింది. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఓ పీరియాడిక్ డ్రామాలో ప్రభాస్ సరసన పూజ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లిన పూజకు అక్కడ ఓ ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైందట.`ఇటీవల అమెరికా వెళ్లినప్పుడు అక్కడి వారు నాతో మాట్లాడ్డానికి వచ్చారు. ఇండియా నుంచి వచ్చానని వారికి చెబితే.. `నువ్వు ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా` అని అడిగారు. దాంతో నేను షాకయ్యా. నేను ప్రభాస్ సినిమాలో నటిస్తున్నానని తెలిసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ప్రభాస్ నిజమైన ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. నేను చూసిన వ్యక్తుల్లో చాలా మంచి వ్యక్తి ప్రభాస్. ఎప్పుడు కూల్‌గా ఉంటాడు. `బాహుబలి` లాంటి పెద్ద సినిమా ప్రభాస్ లాంటి మంచి వ్యక్తికే దక్కిందని నాకెప్పుడూ అనిపిస్తుంటుంద`ని పూజ పేర్కొంది.
పూజ ఫ్రమ్ ప్రభాస్ ల్యాండ్
Related tags :