మలేషియా పర్యటనలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి కై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు రెండు రోజులుగా మలేషియా లో వున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు టీ జీ వో ప్రతినిధులతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట ) ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో 50 మంది వివిధ కంపెనీలకు చెందిన సీఈవోలు , డైరెక్టర్స్ , మేనేజర్స్ హాజరయ్యారు.
ఈ సందర్భముగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్ర అభివృద్ధిలో భాగమయ్యే ప్రతి కంపెనీకి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. మహబూబ్ నగర్ లో 500 ఎకరాలలో ఇండస్ట్రియల్ ఐటీ పార్క్స్ మరియు మల్టీ పర్పస్ పార్క్ ను త్వరలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నదని అందులో పెట్టుబడులు పెట్టేవారికి త్వరగా పెర్మిషన్స్ ఇవ్వటమే కాకుండా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా కల్పిస్తామని అన్నారు. అలాగే తెలంగాణ లో వున్నా టూరిజం స్పాట్స్ గురించి వివరించారు ఇందులో భాగంగా సోమశిల రోడ్ కం రివర్ క్రూజ్ టూర్ బ్రోచర్ ను కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రములో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా టీ జీ వో ప్రతినిధులు మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి , డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి,జనరల్ సెక్రటరీ రవి చంద్ర , ఊమెన్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ అశ్విత, ముఖ్య కార్యవర్గ సభ్యులు కిరణ్ గౌడ్ ,ప్రతీక్, సత్య ,సందీప్ ,సంతోష్ మరియు మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంత రావు గారు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు..