*రాజధాని వ్యవహారం ఎపీలోనే కాదు ఇప్పుడు సింగపూర్ లో రాజకీయ అంశంగా మారింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయమ్లో సింగపూర్ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కుదురుచుకున్న స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ఒప్పందం తాజాగా రద్దు అయ్యింది ఏపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం దృష్టికి దీనికి సంబందించిన ప్రకటనలు కూడా చేసాయి. జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన తరువాత రాజధానిలో నిర్మాణాలను పూర్తిగా నిలిపివేస్తారు.
* ఠాక్రే తొలి కేబినెట్ మంత్రులు వీరే..!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమం కోసం ముంబైలోని శివాజీ మైదానం ముస్తాబవుతోంది. గురువారం సాయంత్రం 6:40 గంటలకు రాష్ట్ర నూతన సీఎంగా ఉద్ధవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఠాక్రేతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు మహా వికాస్ ఆఘడి నేతలు సమావేశం నిర్వహించారు. ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్‌నాథ్ ముండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ కేత్‌లు ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.దీని అనంతరం మంత్రిమండలి తొలిసారి భేటీ కానున్నట్లు తెలిసింది. దీంతో ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌కు ఠాక్రే మంత్రివర్గంలో చోటు లేనట్లేనని స్పష్టమవుతోంది. డిసెంబర్ 3న తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరుగునుందని సమాచారం. దీని అజిత్‌తో పాటు మరికొందరికి అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా ?
కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టిన టీఎస్ఆర్టీసీ కార్మికులకు నేతృత్వం వహించిన అశ్వత్థామరెడ్డి… ఆర్టీసీ కార్మికుల జేఏసీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు వినవస్తోంది. డిమాండ్లు సాధించుకోకుండానే సమ్మె విరమించారంటూ ఆయనపై విమర్శలు వచ్చిన విషయం విదితమే. అయితే మరోవైపు… కార్మికుల ఆత్మహత్యల నేపధ్యంలోనే ఆయన కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినవస్తోంది. అందులో ‘జేఏసీ పదవికి రాజీనామా(?)’ కూడా ఒకటని చెబుతున్నారు. అయితే… అశ్వథ్థామరెడ్డి రాజీనాామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కార్మిక నేతలు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో… తన సంఘంతోపాటు జేఏసీని పటిష్టపరచే దిశగా ఆయన మరింత కసరత్తు చేయనున్నారని పేర్కొన్నారు.
*ప్రజ్ఞా పై కొరడా ఝులిపించిన భాజపా
జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాదూరాం గాడ్సేను దేశ భక్తుదంటూ భాజపా ఎంపీ సాద్వీ ప్రజ్ఞాసింగ్ టాకూర్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలతో పై దుమారం రేగడంతో భాజపా క్రమశిక్షణ చర్యలకు దిగింది. పార్లమెంటు పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు వేసింది డిఫెన్స్ ప్యానల్ నుంచి కూడా ఆమెను తొలగించింది ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కానీయకుండా చూసుకోవాలని హెచ్చరికలు చేసింది.
*పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎ౩న్నికల్లొ భాజపా ముందంజ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా జరిగిన మూడు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు భాజపా అభ్యర్ధులు ఒక స్థానంలో టీ ఎం సి అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. కలియాన్గాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్ధి కమల్ చంద్ర సర్కార్ ముందంజలో ఉన్నారు. ఖరగ్ పూర్ సదర్ నుంచి భాజపా అభ్యర్ధి ప్రేమ చంద్ర ఆధిక్యంలో ఉన్నారు. కరీంపూర్ లో టీఎం సి అభ్యర్ధి బిమిలెండు సిన్హారాయ్ తన సమీప భాజపా అభ్యర్ధి కంటే ముందంజలో ఉన్నారు. కలియాం గాజ్ నిజోయకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్ మహువా మొత్రాయిలు లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికల జరిగింది.
*శంకుస్థాపన స్థలం వద్ద ప్రణమిల్లిన బాబు
ఏపీ రాజధాని అమరావతి పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఉద్దండరాయుడిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని నిర్మాణం ఆపడం అంటే.. 33వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులను అవమానించడమే అని వారు పేర్కొన్నారు. అనంతరం వారందరితో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడ చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.
*పేదల చదువుకు ఎంతఖర్చయినా భరిస్తాం:జగన్
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడిన మహానుభావుడు జ్యోతి రావ్‌పూలే అని ముఖ్యమంత్రి జగన్ కీర్తించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. విప్లవాత్మక మార్పులతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. విద్యార్ధుల చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. బలహీనవర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
*ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న ఉద్ధవ్
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు కీలక బాధ్యతల నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతలను వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ సామ్నా పత్రిక వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అప్పగించారు. సంజయ్ రౌత్ ప్రస్తుతం ఆ పత్రిక కార్యనిర్వాహక సంపాదకుడిగా కొనసాగుతున్నారు. సామ్నా పత్రికను 1988లో బాల్ ఠాక్రే స్థాపించారు.
*బీజేపీకి ఇక రోజులు దగ్గరపడ్డాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఉప ఎన్నికలు జరిగిన మూడు శాసనసభా స్థానాలను తృణమూల్ కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల అనంతరం కలియాగంజ్ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ ఫలితాలపై తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజా విజయంగా పేర్కొన్న ఆమె… బీజేపీకి ఇక రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. అహంకారపూరిత రాజకీయాలు పనిచేయవని, అందుకే బీజేపీని ప్రజలు తిరస్కరించారని మమతా విమర్శించారు. ఖరగ్ పూర్ సదర్ నుంచి పోటీ చేసిన తృణమూల్ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ 20,811 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే కరీంపూర్, కలియాగంజ్ నుంచి తృణమూల్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో విజయంతో తృణమూల్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
*అధికారులపై రెచ్చిపోయిన ఏపీ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఇటీవల ఆయన… ప్రతిపక్ష నేత చంద్రబాబు, సోనియాగాంధీపై వాడిన భాష తీవ్ర దుమారం రేపింది. తాజాగా బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూలే వర్ధంతి సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదంటూ మండిపడ్డారు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే స్పాట్‌లోనే కొడతానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్పీకర్ తమ్మినేని ఆగ్రహంతో అధికారులంతా నిర్ఘాంతపోయారు. సమయాభావం వల్ల సమాచారం ఇవ్వలేకపోయామని అధికారులు సంజాయిషీ ఇచ్చారు.
*టీఆర్ఎస్ ఎంపీ ఛాలెంజ్‌ను స్వీకరించిన కేంద్రమంత్రి
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్వీకరించారు. ఢిల్లీలోని తన నివాసంలో గురువారం మూడు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కె. కేశవ రావు, బండ ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి హరిత తెలంగాణకు కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రకాష్ జవదేకర్ కోరారు.
*వైకాపా ప్రభుత్వం రాజధానిని చంపేసింది
‘అమరావతి నగరాన్ని నిర్మించి రాష్ట్రానికి సంపద వనరుగా తీర్చిదిద్దుదామని అనుకున్నా. వైకాపా ప్రభుత్వం మాత్రం దాన్ని చంపేసింది…’ అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజారాజధాని నిర్మాణ ఉద్దేశాన్ని వివరించేందుకే తాను గురువారం అమరావతిని సందర్శిస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే సమయంలో ఎవరు దీన్ని అనుభవిస్తారు? దాని వల్ల ఎవరికి పేరొస్తుంది? అని తాను అనుకుని ఉంటే దాని ఫలాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందేవా అని ప్రశ్నించారు. అమరావతిని శ్మశానంతో పోల్చి, అక్కడే వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు బతికున్నట్టా లేక చనిపోయినట్లా చెప్పాలని నిలదీశారు.
*సీఎం పదవి మీరే ఉంచుకుని… శివసేన మద్దతు కూడగట్టగలరా?
సీఎం పదవి మీరే ఉంచుకుని… శివసేన మద్దతు కూడగట్టగలరా?భిన్న సిద్ధాంతాలున్న పార్టీలు అధికారం కోసం ఒక్కటయ్యాయి. మహారాష్ట్ర ప్రజల తీర్పును అవమానపరిచాయి. భాజపాను ఎలాగైనా అధికారానికి దూరం చేయాలని విలువలకు తిలోదకాలిచ్చాయి. ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా శివసేన మద్దతు తీసుకోవడం బేరసారాలు కాదా? సోనియాగాంధీ, శరద్ పవార్‌లకు మరోసారి సవాలు విసురుతున్నా. సీఎం పీఠాన్ని మీరే తీసుకుని, శివసేన మద్దతు కూడగట్టుకోగలరా? సేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మేం ఏనాడూ చెప్పలేదు. ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రేలు వేదికపై ఉండగానే… దేవేంద్ర ఫడణవీస్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విస్పష్టంగా చెప్పాం. అప్పుడు వారెందుకు వ్యతిరేకించలేదు? శివసేన తరఫున పోటీచేసిన వారంతా మోదీ బొమ్మ పెట్టుకునే ఎమ్మెల్యేలు అయ్యారు.
*బడులు మూయడమేనా బంగారు తెలంగాణ?: లక్ష్మణ్
రాష్ట్రంలో బడులు మూసి బార్లు తెరవడమేనా బంగారు తెలంగాణ అంటే.. అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ దుయ్యబట్టారు. దిల్లీలో బుధవారం మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించేలా.. రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2020 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డాలను కలిసి రాష్ట్రంలోని సమస్యలు, రాజకీయ పరిస్థితులను వివరించినట్లు తెలిపారు. ఆర్టీసీ సమస్యను కేంద్రం క్షుణ్నంగా పరిశీలిస్తోందన్నారు.
*ఆర్టీసీలో 56 శాతం ప్రైవేటీకరణకు యత్నం-లోక్‌సభలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి
ఆర్టీసీలో 56 శాతాన్ని ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ శూన్యగంటలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 52 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవలేదని, సమస్యలు పరిష్కరించలేదన్నారు. 38 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం చేర్చుకోవడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల నుంచి వసూలు చేసిన రూ.826 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం భవిష్యనిధి ఖాతాలో జమచేయలేదని చెప్పారు. కార్మికచట్టం ప్రకారం దీనిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33శాతం వాటా ఉన్నందున జోక్యం చేసుకోవాలని కేంద్ర రవాణాశాఖ మంత్రిని కోరామని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకొని కార్మికులు విధుల్లో చేరేలా చూడాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
*ఆర్టీసీలో 56 శాతం ప్రైవేటీకరణకు యత్నం-లోక్‌సభలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి
ఆర్టీసీలో 56 శాతాన్ని ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ శూన్యగంటలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 52 రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవలేదని, సమస్యలు పరిష్కరించలేదన్నారు. 38 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం చేర్చుకోవడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల నుంచి వసూలు చేసిన రూ.826 కోట్లను ఆర్టీసీ యాజమాన్యం భవిష్యనిధి ఖాతాలో జమచేయలేదని చెప్పారు. కార్మికచట్టం ప్రకారం దీనిపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33శాతం వాటా ఉన్నందున జోక్యం చేసుకోవాలని కేంద్ర రవాణాశాఖ మంత్రిని కోరామని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకొని కార్మికులు విధుల్లో చేరేలా చూడాలని.. వారి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
*అమిత్‌షాతో తెదేపా ఎంపీల భేటీ
ఎన్డీయేతో తెగదెంపులు చేసుకొన్న తర్వాత తొలిసారిగా తెదేపా ఎంపీలు బుధవారం భాజపా అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. భారతదేశ చిత్రపటంలో అమరావతిని చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశంపై చంద్రబాబునాయుడు రాసిన లేఖను ఆయనకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గూండా రాజ్యం నడుస్తోందని, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని వారు అమిత్‌షా దృష్టికి తెచ్చారు. నాకు తెలుసు (ఐ నో) అని ఆయన దీనిపై బదులిచ్చినట్లు తెలిసింది. ఇంకా చాలా సమస్యలున్నాయని, మళ్లీ అపాయింట్‌మెంట్ తీసుకొని వస్తామని తెదేపా నేతలు చెప్పగా.. ‘మీరు ఎప్పుడైనా స్వేచ్ఛగా రావొచ్చు’ అని అమిత్‌షా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ భేటీలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్, తోటసీతారామలక్ష్మి పాల్గొన్నారు.
*పీసీసీ అధ్యక్షుడిగా నియమించండి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తనని నియమించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విజ్ఞప్తిచేశారు. బుధవారం పార్లమెంటులోని కాంగ్రెస్ కార్యాలయంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను అంజన్‌కుమార్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రెండుసార్లు ఎంపీగా, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తాను కష్టకాలంలోనూ పార్టీతోనే ఉన్నానని తెలిపారు. వివరాలన్నీ చెప్పి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరానన్నారు.
* గాడ్సే దేశ భక్తుడన్న ప్రజ్ఞా సింగ్‌పై బీజేపీ వేటు
మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నిన్న లోక్‌సభలో చేసిన కామెంట్స్‌ను ఆ పార్టీ ఖండించింది. ప్రజ్ఞా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని, ఆమె వ్యాఖ్యలను బీజేపీ సపోర్ట్ చేయదని బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ రకమైన ఐడియాలజీకి తాము వ్యతిరేకమని చెప్పారు.
* ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాజ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’ అధినేత, బాల్ ఠాక్రే అన్నయ్య కుమారుడు రాజ్ ఠాక్రే హాజరుకానున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు రాజ్ ఠాక్రే తమ్ముడు వరుస అవుతారు.బాల్ ఠాక్రే మరణానంతరం శివసేనలో ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ఉద్ధవ్ సఫలం కావడంతో అప్పటివరకూ పార్టీలో కీలకంగా ఉన్న రాజ్ ఠాక్రేకు ప్రాధాన్యం తగ్గింది. అనంతర పరిణామాల నేపథ్యంలో రాజ్ ఠాక్రే శివసేన నుంచి తప్పుకున్నారు. 2006లో ‘మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన’ పేరుతో పార్టీని స్థాపించారు.
సింగపూర్‌లో అమరావతి సునామి-రాజకీయ-11/28
Related tags :