*నిజామాబ్ద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది గత అర్ధరాత్రి ఇసుక తరలింపు వివాదంలో భోధన్ మండలం అచాన్ పల్లిలో రెండు వర్గాల ఘర్షణ చెలరేగింది. దీంతో తమపై దాడి చేసారని అచన్ పల్లికి చెందినా ముగ్గురు యువకుల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు షకీల్ సోదరుడు సాహేల్ తో పాటు మరో ఎనిమిది మంది అనుచరులు పై పోలీసులు కేసు నమోదు చేసారు.
* హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్ ఏరియాలో ఈ నెల 22న జరిగిన పాస్టర్ నారాయణరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
* తండ్రి, సోదరుడు మందలించడంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
* నయీం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 2016లో నయీం ఎన్‌కౌంటర్ తరువాత పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఎట్లా సంపాదించారో వివరాలను ఐటీ శాఖ అధికారులు రాబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సిట్ సేకరించిన రూ. 54 కోట్ల విలువైన 72 ప్రాపర్టీలు, గ్యాంగ్ జరిపిన లావాదేవీల విషయమై నయీం భార్య హసీనాకు ఫిబ్రవరిలో నోటీసులిచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి ఆమెను విచారిస్తున్నారు. మంగళవారమూ మరోసారి విచారించినట్లు తెలిసింది.
*నెల్లూరు జిల్లా కావలి నకీలీ స్టాంపులు, నకిలీ జామీను పత్రాలు సృష్టించే నలుగురు వ్యక్తులు అరెస్ట్కావలి మేజిస్స్టేటు ఫిర్యాదునకిలీ స్టాంపు పత్రాలు, నకిలీ జామీను పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
*గుంటూరు జిల్లాలో మరో అనుమానపు వివాహేతర హత్య జరిగింది. టికి టాక్‌పై మోజుతో పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త.. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఈ దారుణం జిల్లాలోని పొట్లూరులో జరిగింది.
*రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ సమీపంలో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. చటాన్‌పల్లి వంతెన వద్ద మహిళను హత్య చేసి దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.
*ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
*అమెరికాలో హైదరబాదుకు చెందిన యువతి దారుణంగా హత్యకు గురైంది. ఆమె పేరు రూత్ జార్జ్. ప్రస్తుతం ఈమెను హత్య చేసిన నిందితుడు డొనాల్డ్ తుర్మాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి రూత్ జార్జ్ (19) తనతో మాట్లాడేందుకు నిరాకరించడం లేదా తాను పిలిస్తే స్పందించలేదనే కోపంతో నిందితుడు గొంతు నులిమి చంపేసి వుంటాడని ప్రాసిక్యూటర్ వివరించారు.
*రాజస్థాన్‌లోని భివాడి ప్రాంతంలో భార్యకు భర్త ట్రిపుల్ తలాఖ్ చెప్పగానే భార్యపై మామ, బంధువు సామూహిక అత్యాచారం చేశారు
* కూకట్ పల్లి మండలం హైదర్‌నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపూరం మండలం బోడుపాడు గ్రామానికి చెందిన వనపర్తి మహేష్ (28) అనే వ్యక్తి హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసేవాడు
*నవంబర్ 27 హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే తన జీవితంలో చివరి రోజు అయింది. దేవుడి దగ్గరకు వెళుతున్నానని చెప్పిన ఆ యువతి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయింది..
*నిత్యానంద ఆశ్రమంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ కుమార్తె కేసునుబెంగళూరు పోలీసులు సరిగా విచారించటం లేదని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఓ మహిళ డిమాండ్ చేశారు.
*కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ దరఖాస్తుదారునిపై రెవెన్యూ ఉద్యోగి జులుం ప్రదర్శించాడు. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పవన్‌కుమార్ .. కార్యాలయానికి వచ్చిన వ్యక్తిపై దాడికి దిగాడు. ముసునూరు గ్రామానికి చెందిన మద్దాల బాబూరావు ఇటీవల కులధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
*అనుమానం పెనుభూతమైంది. తాళి కట్టి కలకాలం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తే అత్యంత కిరాతకంగా నిండు గర్భిణి అయిన భార్యను హతమార్చాడు. అడ్డొచ్చినందుకు తల్లినీ, బిడ్డలను కూడా చంపేశాడు
*ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉద్యోగం మానలేదని తుపాకీతో కాల్చి చంపాడో భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉర్జూ ఇక్బాల్ ఓ ఉర్దూ దినపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేస్తోంది. ఏడు నెలల క్రితం మరో పత్రికలో జర్నలిస్ట్‌గా పని చేసే దిలావార్ అలీ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి భర్త ఆమెను ఉద్యోగం మానేయమని కోరుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో వీరు వేర్వేరుగా ఉంటున్నారు.
*రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం చటాన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి నిప్పంటించారు. మృతురాలు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న మాదాపూర్‌లోని హాస్పిటల్‌కు ప్రియాంక స్కూటీపై వెళ్లింది. రాత్రి ప్రాంతంలో శంషాబాద్‌కు తిరిగొచ్చింది. అప్పటి నుంచి ప్రియాంకరెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు.
*మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు లొంగుబాటు వివరాలను గడ్చిరోలి ఎస్పీ కార్యాలయంలో డీఐజీ మహాదేవ్ తబండే, ఎస్పీ శైలేష్ బాలాక్వాడ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో కసన్‌సూర్ దళానికి చెందిన దళ కమాండర్ సందీప్ అలియాస్ మహారు చమ్రూ, వివిధ దళాలకు చెందిన మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిపై కిడ్నాప్, ఎన్‌కౌంటర్, హత్య కేసులతో పాటు రూ. 31.50 లక్షల రివార్డ్ ఉంది.
*ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల అయప్ప భక్తుడు బుధవారం చనిపోయారు. మంగళవారం నీలిమల సమీపంలో శబరిమలకు వెళుతున్న తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు.
*తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీప్‌వాటర్ పోర్టులోని సౌత్‌బెర్తు వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో ఓ ట్రాలీ లారీ సముద్రంలో పడిపోగా… నల్గొండకు చెందిన డ్రైవర్ మల్లిరెడ్డి వెంకటరెడ్డి గల్లంతయ్యాడు.
*రాజకీయ ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాడిని నెల్లూరు సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్సు హాలులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులు రెడ్డి వివరాలు వెల్లడించారు.
*మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో మరో పులి మరణించింది. మంగళవారం రాత్రి లాటి ఉపక్షేత్రంలోని కంపార్ట్‌మెంట్ 559లో ఓ కాలువ పక్కన పులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
*కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలంలో ఈ నెల 24న మహిళను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం వారిని ఎస్పీ మల్లారెడ్డి పాత్రికేయుల సమావేశంలో హాజరు పరిచి వివరాలు వెల్లడించారు.
*సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఆవరణలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఆదివారం గœజ్వేల్ పట్టణంలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా బుధవారం మరోసారి కోర్టు ప్రాంగణంలో హల్‌చల్ చేశాడు.
* నమ్ముకున్న కులవృత్తి తిండి పెట్టక, అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్జిల్లా అశోక్ నగర్లో నివాసముంటున్న స్వర్ణకారులు గట్టు ముక్కుల సతీశ్,అతడి భార్య తనూజ బుధవారం ఉదయం ఇంట్లో సైనేడ్ మింగారు. ఉదయం 8 గంటల వరకు భార్యభర్తలిద్దరూ నిద్ర లేవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి చూడగా అప్పటికే చనిపోయారు.
బోధన్ ఎమ్మెల్యేపై కేసు నమోదు-నేరవార్తలు-11/28
Related tags :