‘‘ఏదో చదివి, మరేదో కావాలనుకుని హీరోయిన్ అయ్యా. అనుకోకుండా వచ్చినా ఈ జీవితం చాలా సంతృప్తిగా ఉంది. దేవుడు నా అర్హతకు మించి అన్నీ ఇచ్చాడు. వివిధ భాషల్లో కోట్లాది మంది అభిమానుల ప్రేమను పొందడం మామూలు విషయం కాదు. అందరికీ ఈ అదృష్టం దక్కదు’’ అని అంటున్నారు రాశీఖన్నా. ఆమె మాట్లాడుతూ ‘‘నటన అంటే ఏంటో తెలియకుండా ఇండస్ట్రీలోకి వచ్చా. సినిమా పరిశ్రమ నాకు ఎంతో ఇచ్చింది. జీవితం ఎలా సాగించాలో నేర్పించింది. అందుకే నేను చాలా సింపుల్‌గా ఉంటా. సక్సెస్ వస్తే కళ్లు నెత్తిన పెట్టుకోను. డౌన్ టు ఎర్త్ ఉంటా. అదే నేనీ స్థాయిలో ఉండటానికి కారణం అనుకుంటా. నిజంగా నాకున్న అర్హతలకు మించి దేవుడు నాకు ఇన్ని వరాలు ఇచ్చాడు. ఇంతకన్నా అదృష్టం ఇంకేం ఉంటుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ప్రతి రోజూ పండగే’, ‘వెంకీమామ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
దేవుడు వరాలు ఇచ్చాడు
Related tags :