DailyDose

53వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి-తాజావార్తలు-11/28

Indian IAS Officer Transferred For The 53rd Time-Telugu Breaking News-11/28

*నేను మరోసారి బదిలీ అయ్యాను ఇండియాలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న తదుపరి రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు నియమాలు ఉల్లంఘనులకు గురయ్యాయి.నా సర్వీసులో ఆఖరి దశకు చేరుకున్నాను నిజయరీగా దక్కిన గౌరవం ఇది.
* ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ప్రభుత్వానికి పంపించారు. కారెం శివాజీని గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌‌గా నియమించింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
*అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించింది. ఆమె చనిపోయి నేటికి 24 రోజులు గడిచింది. ఇన్ని రోజుల తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయ తలుపులు తెరుచుకున్నాయి. కొత్త తహసీల్దార్‌గా వెంకట్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.
*మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఆర్ కే న్యూ టెక్ గని వెల్ఫేర్ సెక్షన్ సూపరింటెండెంట్ బాదం వెంకటేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వెంకటేష్ మెడికల్ అనిఫిట్ అయిన రత్నం మొండయ్య అనే కార్మికుని దగ్గర నుంచి రూ.10000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
*రాజధానిలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపుతున్న తమపై పచ్చపార్టీ శ్రేణులు గుండాల్లా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అన్నదాతలపై టీడీపీ నేతల దాడులను నిరసిస్తూ రాజధాని ప్రాంతం రైతులు గురువారం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
*తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేటి మధ్యాహ్నం జరుగనున్నది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీపై చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటే విధించాల్సిన షరతులపై చర్చించే అవకాశం ఉంది.
*సమాజంలో అసమానతలు తొలగిపోతే మహాత్మా జ్యోతిరావు పూలేకు నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్ర శేఖర్ రెడ్డి మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని జిల్లాస్థాయిలో గురువారం కాకినాడ జీజీహెచ్‌ కూడలి వద్ద బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
*1991-బ్యాచ్‌ కేడర్‌కు చెందిన అశోక్ ఇప్పటివరకూ 52 సార్లు బదిలీ అయ్యారు. ఖేమ్కా సహా మరో 14 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది
*ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం అమరావతిలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. రాజధాని రైతులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం రైతులు చంద్రబాబు పర్యటనను నిరసిస్తున్నారు. వారు చంద్రబాబు పర్యటనను నిరిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరొక వర్గం చంద్రబాబు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
*నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిర్మించిన భవనాలను ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుందని తెదేపా నేతలు వెల్లడించారు.
*భారత దేశం నుంచి దొంగచాటుగా తరలిపోయి ‘నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆస్ట్రేలియా’కు చేరిన అపురూపమైన మూడు పురాతన భారతీయ కళాఖండాలు తిరిగి స్వదేశానికి చేరనున్నాయి. జనవరిలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ భారత్‌ పర్యటనలో ఉన్నప్పుడు వాటిని అందచేస్తారు. 6-8 శతాబ్దాల మధ్యకాలానికి చెందిన భారీ నటరాజు, 15వ శతాబ్దం నాటి రెండు ద్వారపాలకుల విగ్రహాలు ఆస్ట్రేలియాకు తరలిపోయాయి
*దాద్రా-నాగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఇకపై ఈ రెండింటినీ కలిపి ‘‘దాద్రా-నాగర్‌ హవేలీ- దమణ్‌ దీవ్‌’’ కేంద్ర పాలిత ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చేదీ తర్వాత ప్రకటిస్తారు. మెరుగైన సేవలు అందించడమే విలీనం ఉద్దేశమని హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు.
*పౌల్ట్రీ పరిశ్రమాభివృద్ధి కోసం మెరుగైన విధానాల రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో కొత్త పథకం ప్రకటించింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఉపకులాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళల జీవన ప్రమాణాలు పెంచి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు వారికి ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.
*ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నిర్వహించిన డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ న్యూరాలజీ ప్రవేశ పరీక్షలో సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన బిల్ల సృజన జయకేతనం ఎగరేశారు. నూటికి 71 మార్కులు సాధించి ఆ విభాగంలో ప్రథమ స్థానం పొందారు.
*హైకోర్టు అనుమతితో పాత జిల్లాల ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఐకాస(టీఏజేఏసీ) ఛైర్మన్‌ మణిపాల్‌రెడ్డి తదితరులు బుధవారం మంత్రిని కలిసి సమస్యలను వివరించారు.
*ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆదేశించారు. వచ్చే నెలలో రైతులకు 2.50 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’ (మార్క్‌ఫెడ్‌)కు సూచించారు
*రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, గిరిజనుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల సాధనకు వచ్చేనెల 8న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ‘లంబాడోళ్ల తడాఖా’ పేరుతో మహాసభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి రవీంద్రనాయక్‌ వెల్లడించారు.
*కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేయకుండా ప్రదర్శనను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో నివేదికను సమర్పించాలని ప్రాంతీయ సెన్సార్‌ బోర్డును బుధవారం హైకోర్టు ఆదేశించింది.
*ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు డిసెంబరు 9నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 9న సోమవారం ఉదయం 9గంటలకు శాసనసభ, తర్వాత 10గంటల ప్రాంతంలో శాసనమండలి సమావేశమవుతాయి.
*హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)కు గోల్డెన్‌ ట్రోఫీ ఇన్‌ బెస్ట్‌ ఇనిస్టిట్యూట్‌ ప్లేస్‌మెంట్స్‌ 2019 అవార్డు లభించింది. దిల్లీలో బుధవారం నిర్వహించిన అసోచామ్‌ స్కిల్‌ ఇండియా 2019 సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌ చేతుల మీదుగా న్యాక్‌ ప్లేస్‌మెంట్స్‌, ట్రైనింగ్‌ విభాగం డైరెక్టర్‌ శాంతిశ్రీ ఈ అవార్డును అందుకున్నారు.
*మనోహరాబాద్‌-కొత్తపల్లి, అక్కన్నపేట-మెదక్‌ రైలు మార్గాల పనులకు సంబంధించి రాష్ట్రం తన వాటా నిధుల విడుదలను ఆలస్యం చేస్తోందని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ తెలిపారు. ఫలితంగా పనులపైనా, బిల్లులు చెల్లింపుపై ప్రభావం పడుతోందన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు
*కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్‌ ద్వారా బుధవారం వరకు 17.04 టీఎంసీల నీటిని గ్రావిటీ కాలువలో ఎత్తిపోశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఏడాది జూన్‌ 21న పంపుల ప్రక్రియను ప్రారంభించారు.
*తిరుపతిలోని విమానాశ్రయంలో ప్రముఖుల కోసం విఐపీ విభాగం (సెరిమోనియల్‌ లాంజ్‌) నిర్మాణానికి ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) భూమిని కేటాయిస్తూ కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
* విజయనగరం జిల్లాలో ప్రముఖ దేవాలయం పూలబాగ్‌ శ్రీ వల్లీదేవసేన సుబ్రమణ్య దేవాలయం నుండి కావడి అట్టాం ఊరేగింపు నవంబర్‌ 30 న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుందని ఆలయ వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. ఆలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి మాట్లాడుతూ… ఈ కావడి ఊరేగింపులో పాల్గనడానికి ఎలాంటి నియమాలూ లేవని, స్త్రీ పురుషులందరూ పాల్గనవచ్చన్నారు. ఊరేగింపు దేవాలయం నుండి బయలుదేరి నీళ్ళ ట్యాంక్‌ మీదుగా మూడు లాంతర్లు, గంటస్థంభం, శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవాలయం, ఉల్లివీధి, పాత బస్టాండ్‌, మండపం వీధి మీదుగా దేవాలయానికి చేరుతుందన్నారు. డిసెంబర్‌ 2 న శ్రీ సుబ్రమణ్యం స్వామి పుట్టినరోజు సందర్భంగా.. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. 5 వ తేదీన లక్ష పుష్పార్చన, 6 న శ్రీ వల్లీదేవసేన సుబ్రమణ్యం స్వామి వారికి సాయంత్రం 4 గంటలకు కళ్యాణం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా కఅష్ణారావు, కార్యదర్శి శ్రీనివాస గోపాల కఅష్ణ, ఉపాధ్యక్షులు దన్నాన రామమూర్తి, ఆలయ అర్చకులు శ్రీనివాస్‌ శర్మ, అగస్త్య శర్మ, ఆర్వీ పంతులు పాల్గన్నారు.