అర్జున్‌కపూర్, కృతిసనన్, సంజయ్‌దత్ కీలకపాత్రల్లో అశుతోష్ గొవారికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘పానిపత్’. 1761లో జరిగిన యూడో పానిపత్ యుద్ధం ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు బాలీవుడ్ తారల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమాలో కృతిసనన్ పోషించిన పార్వతీభాయ్ పాత్రను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ చిత్రంలోని కాశీభాయ్ పాత్రతో పోలుస్తున్నారు. దీంతో ఈ విషయంపై ఇటీవల కృతిసనన్ స్పందించారు.తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు కృతి సనన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఈ సినిమాకు సంతకం చేసినప్పుడే ఇలాంటి పోలీకలు వస్తాయని నేను భావించాను. అప్పట్లో ‘పద్మావత్’ చిత్రాన్ని కూడా ‘బాహుబలి’ చిత్రంతో పోల్చారు. ‘పానిపత్’, ‘బాజీరావ్ మస్తానీ’ ఒకే కాలానికి చెందిన చిత్రాలు. ఈ రెండు చిత్రాల్లోను కొన్ని విషయాలు ఒకేలా అనిపించడానికి కారణం.. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే కాలానికి చెందినవి. అలాగే ఈ రెండు సినిమాల్లోని పాత్రలు ఒకేవిధమైన వస్త్రాలంకరణలో కనిపించారు. ఎందుకంటే పీష్వాలకు ఓ ప్రత్యేకమైన వస్త్రాలంకరణ ఉంటుంది. కానీ ఈ రెండు సినిమాల్లో పాత్రలు మాత్రం ఒకేలా ఉండవు. కేవలం ట్రైలర్ ఒక్కదానినే చూసి సినిమాపై ఓ అభిప్రాయానికి రాకుడదని భావిస్తున్నాను.’ కృతిసనన్ తెలిపారు.
ముందస్తు అభిప్రాయాలు ఏర్పరుచుకోకండి
Related tags :